టీటీడీపీ నేత, కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి మొదటి నుంచి టీఆర్ ఎస్ పార్టీకి కొరకరాని కొయ్యగా ఉన్నారు. గులాబీ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత తనదాడిని మరింతగా పెంచారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఏసీబీ ద్వారా ట్యాప్ చేయబడి రేవంత్ జైలు పాలయ్యారు. ఓటుకు నోటు కేసులో బెయిల్ పై విడుదలైన రేవంత్ మొన్నటి వరకు కొడంగల్ నియోజకవర్గానికే పరిమితమయ్యారు. ఎక్కడైనా పర్యటించవచ్చంటూ హైకోర్టులో ఊరట రావడంతో రేవంత్ హైదరాబాద్ లో అడుగుపెట్టారు. రాజధానిలో అడుగుపెడుతూనే సర్కార్ పై రేవంత్ యుద్ధం ప్రకటించారు. తాడో పేడో తేల్చుకుంటానని తొడగొట్టారు.ఆట కాదు వేట మొదలైందని సవాల్ చేశారు.
అయితే రేవంత్ ప్రకటన ఇపుడు చర్చనీయాంశంగా మారింది. త్వరలో జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో అధికార పార్టీని ఇరుకున పెట్టేందుకు సిద్ధమన్న సంకేతాలను రేవంత్ స్పష్టంగా పంపినట్లయిందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఒకవేళ రేవంత్ అదే వ్యూహంతో ఉంటే టీఆర్ ఎస్ పార్టీ ఏం చేస్తుందనేది ఇపుడు ఆసక్తికరంగా మారింది. గతంలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో రేవంత్ రెడ్డిని కట్టడి చేసింది టీఆర్ ఎస్. కరెక్టుగా చెప్పాలంటే గత ఏడాదిగా రేవంత్ రెడ్డికి సభలో మాట్లాడే అవకాశమే రాలేదు. దూకుడుగా రేవంత్ రెడ్డి చేసిన తప్పిదాలే ఆయన్ని ఇరకాటంలో పడేశాయి అనే వాదన కూడా ఉంది. ఈ నేపథ్యంలో సభలో పలు సందర్భాల్లో రేవంత్ వ్యాఖ్యలపై ఆయన సభకు క్షమాపణ చెప్పిన తర్వాతే మాట్లాడాలంటూ టీఆర్ ఎస్ పట్టుబట్టింది. కానీ రేవంత్ రెడ్డి బెట్టువీడలేదు. దీంతో రేవంత్ మాట్లాడకుండానే ఆ సమావేశాలు అలా ముగిసిపోయాయి.
ఈ నెల 23 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. ఓటుకు నోటు కేసు తర్వాత రేవంత్ రెడ్డి ఇంకా దూకుడుమీదున్నారు. ఆ కేసులో పట్టుబడ్డ రేవంత్ ను సభ నుంచి సస్పెండ్ చేస్తారన్న ప్రచారం జరిగింది. అయితే దాని వల్ల రేవంత్ రెడ్డి హీరో అయిపోతారేమో అన్న చర్చ కూడా జరిగి దాన్ని పక్కన పెట్టారు. ఈ నేపథ్యంలో అధికార పార్టీ రేవంత్ రెడ్డిని కట్టడి చేసేందుకు వేస్తున్న స్కెచ్ ఏమిటి? అనేది ఆసక్తికరంగా మారింది.
ఇప్పటికే రేవంత్ ను ఎక్కువగా పట్టించుకుని పాపులర్ చేశామన్న అభిప్రాయం పార్టీ నేతల్లో వినిపిస్తోంది. ఇలాంటి టైమ్ లో సభ నుంచి సస్పెండ్ చేయడం మంచిది కాదని వెనుకడుగు వేసినట్టుగా తెలుస్తోంది. అందుకే గత సమావేశాల్లో లాగానే ఈసారి కూడా రేవంత్ ను కట్టడి చేయాలని, ఆ క్రమంలో క్షమాపణలు చెప్పాల్సిందేనని పట్టుబట్టాలని టీఆర్ ఎస్ ఎమ్మెల్యే లు పట్టుదలగా ఉన్నారు. ఈ ఎత్తుగడతో రేవంత్ రెడ్డి దూకుడుకు కళ్ళెం వేయాలనేది అధికారపక్ష వ్యూహమంటున్నారు. అయితే అప్పట్లా ప్రతిపక్షాలు వేర్వేరుగా లేవు. రైతుల ఆత్మహత్యలు, ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు డిజైన్ మార్పు లాంటి అంశాలపై ప్రతిపక్షాలన్నీ ఏకతాటి పైకి వచ్చాయి. రేవంత్ విషయంలో మిగతా ప్రతిపక్ష పార్టీలు ఎలా స్పందిస్తాయన్నది సస్పెన్స్ గా మారింది.