సెటిలర్లు.. సెటిలర్లు అంటూ తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో టీఆర్ ఎస్ పార్టీ ఏ రేంజ్ లో విరుచుకుపడిందో ప్రతిఒక్కరికి తెలిసిందే. అయితే.. తాజాగా జరుగుతున్న గ్రేటర్ ఎన్నికల్లో విజయానికి సెటిలర్ల ఓట్లు కీలకంగా మారిన నేపథ్యంలో.. వారి మనసుల్ని దోచుకోవటానికి.. వారి ఓట్లను సొంతం చేసుకోవటానికి వీలుగా.. ఈ మధ్యన ఆ పార్టీకి చెందిన వారంతా పొగిడేయటం తెలిసిందే.
ఈ మధ్యన తెలంగాణ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. తాను సైతం సెటిలర్ నేనని.. ఆ మాటకు వస్తే హైదరాబాద్ లో ఉన్న వాళ్లంతా సెటిలర్లేనని.. స్థానికులు ఇక్కడ ఎవరూ లేరంటూ సెటిలర్ అనే మాటకు కొత్త అర్థాన్ని చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. ఇదిలా ఉండగా.. తాజాగా పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ప్రకటించిన టీఆర్ ఎస్.. తాజాగా కొందరు సెటిలర్లకు టిక్కెట్టు ఇవ్వటం గమనార్హం.
గ్రేటర్ ఎన్నికల్లో నామినేషన్ దాఖలకు చివరి రోజు కావటం.. ఇప్పటికే అభ్యర్థుల జాబితాల్ని విడుదల చేయాల్సిన పార్టీలు హడావుడిగా జాబితాలు విడుదల చేస్తున్నాయి. ఇక.. తెలంగాణ అధికారపక్షం తాజాగా విడుదల చేసిన జాబితాలో పలువురు సెటిలర్లను పార్టీ అభ్యర్థులుగా బరిలోకి దించటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. గెలుపే లక్ష్యమైనప్పుడు.. ఇలాంటి నిర్ణయాలు తప్పవు మరి.