బలం లేని చోట గెలుపు అంత తేలికైన వ్యవహారం కాదు. కానీ.. అలాంటి క్లిష్టమైన ఫీట్ ను విజయవంతంగా పూర్తి చేసేందుకు తెలంగాణ అధికారపక్షం తన సర్వశక్తుల్ని ఒడ్డిందని చెప్పక తప్పదు. కొద్ది రోజులుగా సాగుతున్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు ఆదివారం జరిగిన పోలింగ్ తో ముగిశాయి. ఓట్ల లెక్కింపు మినహా.. మిగిలిన కార్యక్రమాలన్నీ పూర్తి అయినట్లే. ఓట్ల లెక్కింపు ఈ నెల 30న.. అంటే రెండు రోజుల్లో తుది ఫలితాలు విడుదల కానున్నాయి.
ఎన్నికల పోలింగ్ జరిగిన తీరును చూస్తే.. తెలంగాణ అధికారపక్షం క్లీన్ స్వీప్ ఖాయమన్న మాట బలంగా వినిపిస్తోంది. కాస్త అటూఇటూ అయ్యే అవకాశం ఉందన్న ఖమ్మం ఎన్నిక సైతం తెలంగాణ అధికారపక్షానికి అనుకూలంగా జరిగినట్లుగా రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. కమిట్ మెంట్ కు మారుపేరుగా నిలిచే కమ్యూనిస్టులు సైతం కట్టు తప్పటంతో.. ఖమ్మం జిల్లా ఎన్నికలోనూ గులాబీ జట్టుదే గెలుపు అన్న మాట బలంగా వినిపిస్తోంది. సొంత పార్టీ వారే హ్యాండ్ ఇచ్చిన నేపథ్యంలో.. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారంటూ సీపీఎం.. న్యూ డెమోక్రసీ పార్టీలు తమ ఎంపీటీసీలను సస్పెండ్ చేయటం చూస్తే.. పోలింగ్ లో గులాబీ గాలి ఏ స్థాయిలో వీచిందో అర్థమవుతుందని చెప్పొచ్చు.
తెలంగాణ అధికారపక్ష హవా నడుస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో.. టీఆర్ఎస్ బలం ఏ స్థాయిలో పెరిగిందన్న విషయం తాజా ఎమ్మెల్సీ ఎన్నికల ద్వారా రుజువు అవుతుందన్న మాట వినిపిస్తోంది. మొత్తం 12 స్థానాలకు ఆరు స్థానాలు ఇప్పటికే ఏకగ్రీవమైన నేపథ్యంలో.. మిగిలిన ఆరు స్థానాలకు ఎన్నికలుజరిగాయి. ఆదివారం ముగిసిన పోలింగ్ ప్రక్రియను పరిశీలిస్తే.. క్లీన్ స్వీప్ దిశగా కారు దూసుకెళుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏదైనా అద్భుతం జరిగితే తప్పించి.. కారు జోరుకు బ్రేకులు పడే అవకాశమే లేదన్న మాట బలంగా వినిపిస్తోంది.