150 డివిజన్లు ఉన్న గ్రేటర్ లో ప్రధాన రాజకీయ పక్షాలకు లభించిన డివిజన్లు. తెలంగాణ అధికారపక్షాన్ని నిత్యం తిట్టిపోస్తూ.. వారి విధానాల్ని తప్పు పట్టే పార్టీలకు లభించిన స్థానాలు చూస్తే నోటి వెంట మాట రాని పరిస్థితి. కేవలం 20 నెలల వ్యవధిలో గ్రేటర్ లో పాగా వేయటంలో అధికార టీఆర్ ఎస్ విజయం సాధించిందనే చెప్పాలి.
గ్రేటర్ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా తొలిసారి ప్రధాన రాజకీయ పక్షాలకు చేదు అనుభవం ఎదురైన పరిస్థితి. మరింత ఆసక్తికర మైన విషయం ఏమిటంటే.. ఏడేళ్ల కిందట జరిగిన గ్రేటర్ ఎన్నికల్లో కనీసం బరిలో దిగేందుకు సైతం సాహసం చేయలేని టీఆర్ ఎస్.. ఈసారి ఏకంగా 99 స్థానాల్ని కైవశం చేసుకోవటమంటే చరిత్రను తిరగరాసినట్లే.
150 స్థానాలున్న గ్రేటర్ లో 99 స్థానాలు ఒకే పార్టీ చేజిక్కించుకోవటం అంటే మాటలు కాదు. గ్రేటర్ ఎన్నికల సందర్భంగా గ్రేటర్ ప్రజలు తమ తీర్పుతో అధికార.. విపక్షాలకు షాక్ ఇచ్చారనే చెప్పాలి. ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం ఊహించనన్ని డివిజన్లను కట్టబెట్టటం ద్వారా గ్రేటర్ ప్రజలు అధికారపార్టీకి స్వీట్ షాక్ ఇస్తే.. కలలో కూడా ఊహించని ఓటమి తీర్పునిచ్చ విపక్షాల నోట మాట రాకుండా చేశారు.
తమకొచ్చిన స్థానాల గురించి అధికార.. విపక్ష నేతలంతా ఆశ్చర్యంగా మాట్లాడుకోవటం ఆసక్తికరం. ఇలాంటి సీన్ గ్రేటర్ ఎన్నికల్లోనే చోటు చేసుకుంటుందేమో. సెంచరీకి ఒక్క స్థానం తక్కువగా వచ్చి.. మరీ ఇంత భారీ విజయమా అని నోటి వెంట మాట రాని ఆనందంలో టీఆర్ ఎస్ నేతలు.. కార్యకర్తలు ఆనందంలో మునిగిపోతే.. ఓడిపోతే ఓడిపోయాం మరీ ఇంత దారుణ ఓటమా? అంటూ విపక్షాలు వాపోతున్నాయి. తెలుగుదేశం పార్టీ ఒక్క స్థానంలో.. కాంగ్రెస్ రెండు స్థానాల్లో.. బీజేపీ నాలుగు స్థానాల్లో మాత్రమే విజయం సాధించటం చూసినప్పుడు.. ఏందే ఈ సీట్లు అంటూ ఆయా పార్టీ నేతలు బేలగా మాట్లాడుకోవటం కనిపిస్తోంది.