మునుగోడులో టీఆర్ఎస్ 10-12 వేల ఓట్లతో గెలుస్తుందా? కారణం అదేనా?

Update: 2022-10-26 12:30 GMT
మునుగోడు హీట్ పతాకస్థాయికి చేరింది. ఆపరేషన్ బీజేపీ చేపట్టిన కేసీఆర్.. ఆ పార్టీలో చేరిన పాత దిగ్గజ టీఆర్ఎస్ నేతలను వెనక్కి రప్పించడంలో సఫలీకృతుడు అయ్యాడు. ఇప్పటికే దాసోజు శ్రవణ్, స్వామిగౌడ్ వెనక్కి వచ్చేయగా.. మరింత మంది క్యూలో ఉన్నట్టు సమాచారం. ఇక కేసీఆర్ ను ప్రజాక్షేత్రంలోనే ఎదుర్కోవాలని బీజేపీ స్కెచ్ గీసింది. నిన్న కేసీఆర్ పై పోస్టర్లు రిలీజ్ చేయగా.. ఈరోజు 15 ప్రశ్నలు సంధించింది. టీఆర్ఎస్ పై ముప్పేట దాడికి రెడీ అవుతోంది.

మునుగోడు కాంగ్రెస్ అసెంబ్లీ సీటు.. 2018 ఎన్నికల్లో దాదాపు  20 వేల ఓట్లతో కాంగ్రెస్ ఇక్కడ గెలిచింది. రాజగోపాల్ రెడ్డి ఈజీగా గెలిచారు. ఇప్పుడు బీజేపీలోకి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసి వెళ్లడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. బీజేపీ తరుఫున పోటీచేస్తున్నా మునుపటి ఊపు మాత్రం లేదు. మునుగోడు ఎప్పటి నుంచో కమ్యూనిస్టులు.. ఆ తర్వాత కాంగ్రెస్ కు పెట్టని కోటలా ఉంది. బీజేపీలో చేరిన రాజగోపాల్ రెడ్డికి అదే కలవరపెడుతోంది.
 
మునుగోడులో కమ్యూనిస్టు పార్టీ బలంగా ఉంది. గతంలో 3-4 సార్లు మునుగోడులో కమ్యూనిస్టు పార్టీనే గెలిచింది. టీడీపీ ఓట్లు ఇక్కడ దాదాపు 5-6 వేలు ఉన్నాయి. కమ్యూనిస్టులకు 12-14 వేల ఓటు బ్యాంకు ఉన్నట్టు సమాచారం. ఇప్పుడు మునుగోడులో అధికార టీఆర్ఎస్ కు కమ్యూనిస్టు పార్టీ సపోర్టు చేసింది. దీంతో కమ్యూనిస్టుల 90 శాతం ఓట్లు టీఆర్ఎస్ కే పడబోతున్నాయని సమాచారం.  ఇక టీడీపీ పోటీచేయకపోవడంతో ఆ పార్టీ ఓట్లు కూడా టీఆర్ఎస్ కే పడే పరిస్థితి ఉందట.. ఇక కాంగ్రెస్ లో ఉండగా రాజగోపాల్ రెడ్డికి పడిన ఓట్లలో దాదాపు 30వేల ఓట్లు ఈసారి బీజేపీలో చేరడంతో కోల్పోతున్నాడని నియోజకవర్గంలో లెక్కలు కడుతున్నారు. బీజేపీ లోకి వెళ్లిన రాజగోపాల్ రెడ్డి ఇదే సమయంలో టీఆర్ఎస్  నుంచి దాదాపు 10వేల ఓట్లు లాగుతున్నాడంట.. కేసీఆర్ మీద వ్యతిరేకతతో 10వేల ఓట్లు బీజేపీకి పడబోతున్నాయని క్షేత్రస్థాయి వర్గాల నుంచి సమాచారం అందుతోంది.

ఇంకా ఎన్నికలకు ఒక సంవత్సరం మాత్రమే ఉంది కాబట్టి అధికార పార్టీని గెలిపిస్తేనే అభివృద్ధి జరుగుతుందని మెజార్టీ ప్రజలు భావిస్తున్నారట..  ఇక స్వతహాగానే టీఆర్ఎస్ పాజిటివ్ ఓటు బ్యాంకు ఇక్కడ బాగా ఉందని సమాచారం. దుబ్బాక, హుజూరాబాద్ ఎన్నికల్లో చేసిన ఒకసర్వే తాజాగా మునుగోడులో కూడా నిర్వహించారట.. వారు చేసిన సర్వే పక్కాగా ఆ నియోజకవర్గాల్లో నిజమైంది. ఇప్పుడు మునుగోడులో వారు చేసిన సర్వే సంచలనమైంది.

ఆ సర్వే ప్రకారం టీఆర్ఎస్ మునుగోడులో 10-12వేల ఓట్ల తేడాతో ముందంజలో ఉందని సర్వేలో తేలిందట.. బీజేపీ అనుకూల సర్వేలు కూడా బీజేపీకి కేవలం 2-3 శాతం మెజారిటీ ఉందని తేల్చాయట.. అంటే పరోక్షంగా టీఆర్ఎస్ కి ఆధిక్యం ఉందని కమలనాథుల్లోనూ కంగారు మొదలైందట..
     
అయితే డబ్బు ప్రభావం ఎక్కువ ఉంది కాబట్టి చివరి రోజుల్లో డబ్బులు గనుక ఎవరు ఎక్కువగా ఇస్తే వాళ్లకు కొంత ఓటు మారే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈరోజు వరకూ అయితే టీఆర్ఎస్ కొంచెం మెరుగ్గా ఉంది. మరి ఎన్నికల వేళకు ఈ ఎడ్జ్ ఉంటుందా? టీఆర్ఎస్ గెలుస్తుందా? అంటే చెప్పలేని పరిస్థితి.  ఓవరాల్ గా అయితే గులాబీ పార్టీకే గెలుపు అవకాశాలు ఉన్నాయని మెజార్టీ సర్వేలు ఆఫ్ ది రికార్డ్ గా చెబుతున్నాయి.

అయితే కేంద్రంలోని బీజేపీని తక్కువ అంచనావేయడానికి లేదు. దుబ్బాక, హుజూరాబాద్ లో పనిచేసిన మ్యాజిక్ ఇక్కడ కొనసాగితే పరిస్థితులు తలకిందులవుతాయి. మరి ఈసర్వేల ప్రకారం టీఆర్ఎస్ గెలుస్తుందా? లేక బీజేపీ హిస్టరీ రిపీట్ చేస్తుందా? ఈ సర్వేలన్నీ నిజమవుతాయా? లేక ఫేక్ నా? అన్నది మున్ముందు తేలనుంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News