ఇలా చేసినందుకు ట్రంప్‌ ను చీ కొట్ట‌డ‌మే కాదు..!!

Update: 2020-11-20 02:30 GMT
ప్ర‌పంచ దేశాల చూపును త‌న‌వైపు తిప్పుకొన్న అమెరికా అధ్య‌క్ష‌ ఎన్నిక‌లు ఫ‌లిత త‌ర్వాత ఒకింత చికాకుకు గురిచేస్తున్న సంగ‌తి తెలిసిందే. దీనికి కార‌ణం ప్ర‌స్తు అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌. అధ్యక్షుడిగా ఎన్నికైన జో బిడెన్ ఎన్నికల్లో విజేతగా ప్రకటించినప్పటి నుంచి.. ఎన్నికల్లో విస్తృతంగా మోసం జరిగిందని ట్రంప్ ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. ఫలితాలను చట్టపరంగా సవాల్‌ చేస్తానని స్పష్టం చేస్తున్నారు. ఈ సంద‌ర్భంలోనే వివాదాస్ప‌ద నిర్ణ‌యాలు తీసుకుంటున్నారు. తాజాగా వ‌ల‌స‌ల‌ను క‌ఠిన‌త‌రం చేసే మ‌రో నిర్ణ‌యం వెలువ‌రించారు.

అమెరికాలో అధికార మార్పిడి ప్రక్రియను పూర్తిచేయాల్సిన బాధ్యత జనరల్‌ సర్వీస్‌ అడ్మినిస్ట్రేషన్‌ దే (జీఎస్‌ ఏ).  బైడెన్ - కమలా హ్యారిస్‌ ఎన్నికను జీఎస్ ఏ ఇంకా అధికారికంగా గుర్తించలేదు. ఈ స‌మ‌యంలోనే ట్రంప్ త‌న దూకుడు కొనసాగిస్తున్నారు. త‌ను ప‌గ్గాలు చేప‌ట్టింది మొద‌లు వల‌స‌ల‌ను టార్గెట్ చేసిన ట్రంప్ ప‌ద‌వి నుంచి దిగిపోయే ముందు కూడా అదే ప‌నిలో ఉన్నారు. అమెరికా నుంచి శరణార్థులను పంపించే ప‌నిలో ఆయ‌న ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. ఇందుకోసం హోం లాండ్ సెక్యూరిటీ విభాగంతో సంప్ర‌దింపులు - ఒప్పందాలు చేసే ప్రయత్నం చేస్తున్నారని అమెరికా మీడియా పేర్కొంటోంది. రోనా వైరస్ వల్ల విద్యార్థి వీసా - పని అనుమతికి సంబంధించి చర్చలు ఇందులో ప్ర‌ధానంగా ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఈ నిర్ణ‌యంతో ప‌లువురు భార‌తీయులు కూడా ప్ర‌భావితం కానున్న సంగ‌తి తెలిసిందే. ఓ వైపు ప‌ద‌వి దిగిపోకుండా మ‌రోవైపు ఇలాంటి వివాదాస్ప‌ద నిర్ణ‌యాలతో అమెరికా ప‌రువు తీస్తున్నార‌ని ప‌లువురు ట్రంప్‌ పై ఫైర‌వుతున్నారు.

ఇదిలాఉండ‌గా, అమెరికా ప్రెసిడెంట్‌ ఎలక్ట్‌ జోబైడెన్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. కోవిడ్‌ లాంటి అంతర్జాతీయ సవాళ్లపై భారత ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు  చెప్పారు. కమలా హ్యారిస్‌తో కలిసి ఇండోఅమెరికా బంధాన్ని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తామన్నారు. ఇండో పసిఫిక్‌ ప్రాంతంలో శాంతిభద్రతల నిర్వహణ, ప్రపంచంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థను రికవరీ బాట పట్టించడం లాంటి అంశాలపై మోదీతో కలిసి పనిచేయాలని చూస్తున్నట్లు బైడెన్‌ తెలిపారు. 1970 నుంచి సెనేటర్‌గా బైడెన్‌ భారత్‌కు బలమైన మద్దతునిస్తున్నారు. 2008లో ద్వైపాక్షిక అణుఒప్పంద ఆమోదం కోసం బైడెన్‌ గట్టిగా కృషి చేశారు.
Tags:    

Similar News