ట్రంప్... కొత్త సోష‌ల్ మీడియా ప్లాట్ ఫాం!!

Update: 2021-03-22 10:37 GMT
త‌న‌దైన శైలిలో సంచ‌ల‌నాల‌కు వేదిక‌గా మారిన అమెరికా గ‌త అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌... ఇప్పుడు కూడా అంతే దూకుడుగా ముందుకు సాగుతున్నారు.. అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో త‌న ఓట‌మిని ఒప్పుకోవ‌డానికి స‌సేమిరా అన్న ట్రంప్‌.. చివ‌ర‌కు నాట‌కీయ ప‌రిణామాల నేప‌థ్యంలో ప‌ద‌విని వ‌దులుకున్నారు.. అయితే.. దీనికి ముందు ఆయ‌న అమెరికా అధ్య‌క్షుడిగా... సోష‌ల్ మీడియాను ఎక్కువ‌గా వినియోగించుకుని ప్ర‌జ‌ల‌కు చేరువ‌య్యారు. ప్ర‌ధానంగా ప్ర‌పంచ వ్యాప్తంగా ట్విట్ట‌ర్ ఫాలోవ‌ర్లు ఎక్కువ‌గా ఉన్న నాయ‌కుడు ట్రంపే.

అయితే.. ఎన్నికల స‌మ‌యంలో రెచ్చ‌గొట్టే వ్యాఖ్య‌లు చేశార‌న్న కార‌ణంగా.. ట్విట్ట‌ర్ సంస్థ‌.. ట్రంప్‌ను శాశ్వ‌తంగా తొల‌గించింది. దీంతో ట్రంప్ వాయిస్ వినిపించేందుకు స‌రైన వేదిక లేకుండా పోయింది ఆయ‌న ఏం మాట్లాడినా. ఏ కామెంట్ చేసినా.. స‌ద‌రు ట్వీట్‌కు నిముషాల వ్య‌వ‌ధిలో రీట్వీట్లు ప‌డేవి. ఇక‌, ఇప్పుడు ఆయ‌న మాజీ కావ‌డం.. సోష‌ల్ మీడియాలో ఆయ‌న‌ను త‌ప్పించ‌డంతో ఆయ‌న వాయిస్ ఎవ‌రికీ వినిపించ‌డం లేదు. ఈ నేప‌థ్యంలో ట్రంప్ సొంతగా సోషల్ మీడియా ప్లాట్ ఫాం ఏర్పాటు చేసుకుని రీ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయిపోతున్నారు.

రెండు మూడు నెలల్లో ట్రంప్ సొంత సోష‌ల్ మీడియా ఏర్పాటు కానున్న‌ట్టు ట్రంప్‌ సీనియర్ అడ్వైజర్లు వెల్లడించారు. జాసన్ మిల్లర్ మాట్లాడుతూ.. సోషల్ మీడియా స్పేస్ లోకి కొత్త ప్లాట్ ఫాం ద్వారా అడుగు పెట్టేందుకు సిద్ధమవుతున్నాం. ఇది పూర్తిగా రీ డిఫైన్ గేమ్ అని వెల్లడించారు. దీంతో త్వ‌ర‌లోనే ట్రంప్ త‌న గ‌ళాన్ని .. త‌న సోష‌ల్ మీడియా వేదిక‌గానే వినిపించ‌నున్నారు. ఇక‌, ఆయ‌న వ్యాఖ్య‌లకు హద్దులు నిర్ణ‌యించేవారు.. ఆంక్ష‌లు పెట్టేవారు ఎవ‌రూ ఉండే అవ‌కాశం లేద‌ని తెలుస్తోంది. ఇక‌, అప్పుడు ఎలా రెచ్చిపోతారో చూడాలి.





Tags:    

Similar News