ప్రస్తుతం ప్రపంచంలోని చాలా దేశాలు మహమ్మారి ట్రీట్మెంట్ లో యాంటీ మలేరియా డ్రగ్ హైడ్రాక్సీక్లోరోక్విన్ వాడుతున్న విషయం అందరికి తెలిసిందే. అయితే ఇప్పుడు తనకు మహమ్మారి లక్షణాలు ఏవి లేవు అని అంటూనే హైడ్రాక్సీక్లోరోక్విన్ వాడుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం ఆశ్చర్యకరమైన ప్రకటన చేశారు. కరోనా వైరస్ నివారణకు ముందుజాగ్రత్తగా తాను దాదాపు 10 రోజుల నుంచి హైడ్రాక్సీక్లోరోక్విన్ ట్యాబ్లెట్లు తీసుకుంటున్నట్లు ట్రంప్ తెలిపారు. హైడ్రాక్సీక్లోరోక్విన్ టాబ్లెట్ల ఉపయోగం గురించి అమెరికాలోని ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ హెచ్చరిక జారీ చేసినా, తాను రోజుకు ఒక మాత్ర చొప్పున దాదాపు 10రోజులుగా హైడ్రాక్సీ క్లోరోక్విన్ మాత్రలు వేసుకుంటున్నానని ట్రంప్ చెప్పారు.
అయితే ఎందుకు అలా మాత్రలు తీసుకుంటున్నారన్న ప్రశ్నకు...హైడ్రాక్సీక్లోరోక్విన్ చాలా మంచిదని తాను అనుకుంటున్నట్లు తెలిపారు. హైడ్రాక్సీక్లోరోక్విన్ గురించి చాలా మంచి స్టోరీలు విన్నట్లు చెప్పారు. తనకు కరోనా వైరస్ పరీక్షలు చేసిన వైట్ హౌస్ డాక్టర్ ని హైడ్రాక్సీక్లోరోక్విన్ మాత్రల గురించి అడిగానని, ఆ డాక్టర్ ‘‘మీకు నచ్చితే మంచిది’’ అని చెప్పారని ట్రంప్ వెల్లడించారు.సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కదా అని విలేకరులు ప్రశ్నించగా.. అలాంటిదేమీ లేదని.. తాను బాగానే ఉన్నా కదా అంటూ వారిని ఎదురు ప్రశ్నించారు
ఈ మహమ్మారి సోకిన పేషెంట్లకు , దాని నుండి ఉపశమనం కలిగించడంలో హైడ్రాక్సీక్లోరోక్విన్ సత్ఫలితాలను ఇస్తుందన్న వార్తల నేపథ్యంలో తమకు ఈ డ్రగ్ ను ఎగుమతి చేయాల్సిందిగా ట్రంప్ భారత్‌ను కోరిన విషయం తెలిసిందే. కానీ అమెరికాలో జరిగిన తదుపరి అధ్యయనాల్లో ఆ టాబ్లెట్లు కరోనా నివారణకు సహాయపడలేదని నిపుణులు తేల్చారు. ఆ తర్వాత అతినీలలోహిత కిరణాలు కోవిడ్-19 చికిత్సకు ఉపకరిస్తాయంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. అనంతరం రెమిడిసివిర్ మందు కరోనా చికిత్సకు ప్రభావవంతంగా పనిచేస్తుందని చెప్పుకొచ్చారు. కాగా, అమెరికా లో ఇప్పటి వరకు 15లక్షల 50వేల 294కేసులు నమోదుకాగా,91వేల 981మంది చని పోయారు. 3లక్షల 56వేల383మంది కోలుకున్నారు