వివాదాలతో సహవాసం చేస్తుంటారు కొందరు. తాము నమ్మిన దాని కోసం చట్టాన్ని అసరాగా చేసుకొని సంచలనంగా వ్యవహరిస్తుంటారు. అయితే.. ఇలాంటి వారు చేసే చేష్టలు చూసినప్పుడు పలువురు సంధించే ప్రశ్నలకు వారి నుంచి సమాధానాలు రాని పరిస్థితి. శబరిమలలో ఒక వయసుకు వచ్చిన తర్వాత దర్శనానికి అనుమతించకూడదన్నది అక్కడి వారి నమ్మకం.
శబరిమలను పవిత్రస్థలంగా భావించే వారు ఆ నమ్మకానికి కట్టుబడి ఉంటారు. అయ్యప్ప మీద విశ్వాసం ఉన్న పక్షంలో.. అక్కడి వారి నమ్మకాలకు విలువ ఇవ్వాల్సిన అవసరం ఉంది. కానీ.. అందుకు భిన్నంగా మహిళల పట్ల వివక్ష ప్రదర్శిస్తున్నారన్న పేరుతో కొందరు మహిళలు (అదే సమయంలో కోట్లాది మంది మహిళలు వారి చర్యను తప్పు పడుతుంటారు) శబరిమల అయ్యప్ప దర్శనం కోసం నమ్మకాల్ని పక్కన పెట్టేస్తామంటారు.
తమ పట్టుదలను ప్రదర్శించుకోవటానికి కోట్లాది మంది సెంటిమెంట్లను పణంగా పెట్టాల్సిన అవసరం ఉందా? అన్నది ప్రశ్న. కొందరి సెంటిమెంట్లను సంతృప్తి పర్చటానికి కోట్ల మందిని అసంతృప్తికి గురి చేయాల్సిన అవసరం ఉందా? అన్నది మరో ప్రశ్న. భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ రోజు తాను శబరిమల దేవాలయాన్ని సందర్శిస్తానని మహిళా యాక్టివిస్టు తృప్తి దేశాయ్ ప్రకటించి మరో వివాదానికి తెర తీశారు.
శబరిమల దేవాలయ సందర్శనకు వచ్చిన ఆమె మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం లేదంటే పోలీసులు తనను ఆపేందుకు ప్రయత్నించినా తాను మాత్రం శబరిమలను సందర్శించి తీరుతానని ప్రకటించారు. కేరళ పోలీసులు తనకు భద్రత కల్పించకున్నా.. తాను మాత్రం దేవాలయ సందర్శనకు వెళతానని చెప్పటం చూస్తే.. నిజంగానే స్వామి దర్శనం కోసమే అయినప్పుడు మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడి అందరి చూపు తన మీద పడేలా తృప్తి ఎందుకు వ్యవహరిస్తున్నట్లు? దొంగచాటుగా వెళ్లమని చెప్పటం లేదు.. అదే సమయంలో వివాదానికి తెర తీసేలా ఎందుకు వ్యవహరిస్తున్నారన్నది ప్రశ్న. తన తృప్తి కోసం కోట్లాది మంది మనోభావాల్ని దెబ్బ తీయటం ఏమిటి తృప్తి అని ప్రశ్నిస్తున్నారు పలువురు.