తెలంగాణ ఆర్టీసీ కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం తలపెట్టిన సమ్మె నేటికీ కొనసాగుతూనే ఉంది. ఈ నెల 5వ తేదీన యాభై వేల మందికి పైగా ఆర్టీసీ కార్మికులు ఆందోళన బాట పట్టారు. అయితే బతుకమ్మ - దసరా పండుగ నేపథ్యంలో ప్రభుత్వాన్నిధిక్కరించి సమ్మెకు పోవడం సరికాదు అని ప్త్రభుత్వం చెప్పింది. కానీ - పట్టువీడని కార్మికులు సమ్మె లో పాల్గొన్నారు . ఆ క్రమంలో ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె 25వ రోజుకు చేరుకున్నప్పటికీ ప్రభుత్వం మెట్టు దిగి రావడం లేదు. మరోవైపు హైకోర్టులో విచారణలు జరుగుతూనే ఉన్నాయి తప్ప సరైన పరిష్కారం చూపించలేకపోతుంది.
ఆర్టీసీ సమ్మె కారణంగా ప్రజలకి ఇబ్బందులు తప్పడం లేదు. తాత్కాలిక సిబ్బందితో ఆర్టీసీ అధికారులు బస్సులు నడుపుతున్నప్పటికీ.. నిత్యం ఏదో చోట ప్రమాదాలు జరుగుతున్నాయి. మరోవైపు ఉద్యోగ భద్రతపై ఎలాంటి క్లారిటీ లేకపోవడం.. పోయిన నెల జీతాలు చెల్లించకపోవడం వంటి కారణాలతో కొందరు ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్న సందర్భాలు కనిపిస్తున్నాయి. ఇన్ని జరుగుతున్నా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకుండా వేచి చూసే ధోరణిలో ఉంది.
అయితే ఆర్టీసీ కార్మికులు ఇన్ని రోజులుగా చేస్తున్న సమ్మె చారిత్రాత్మకం కానుంది. ఇదే అతి పెద్ద సమ్మెగా రికార్డు నమోదు చేయనుంది. ఇంతకుముందు తెలంగాణ ఉద్యమంలో జరిగిన సకల జనుల సమ్మెకు ఆర్టీసీ కార్మికులు 27 రోజుల పాటు మద్దతుగా నిలిచారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా ఆర్టీసీ కార్మికులు ఒకసారి పెద్ద ఎత్తున సమ్మె చేశారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆర్టీసీ పరిరక్షణ - వేతన సవరణ డిమాండ్ తో సమ్మె జరిగింది. అప్పుడు 24 రోజుల పాటు ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగారు. కానీ , ఈసారి ఇప్పటికే సమ్మె ప్రారంభమై 25 రోజులు అవుతుంది. కానీ - సమ్మె పై ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోలేదు. దీనితో ఆర్టీసీ చరిత్రలో ఈ సమ్మె అతి పెద్దదిగా నిలవబోతుంది అని చెప్పవచ్చు.