టీటీడీ కీలక నిర్ణయం... వ్యాక్సిన్ లేదా నెగటివ్ రిపోర్ట్ ఉంటేనే కొండపైకి..!!
దేశంలో కరోనా సాధారణ స్థితికి చేరుకుంటుంది అనుకునే లోపే కరోనా వైరస్ నుంచి మరో కొత్త వేరియంట్ పుట్టుకు వచ్చింది. అయితే దీనితో జాగ్రత్తగా ఉండాలని ఇప్పటికే కొన్ని సంస్థలు వివిధ దేశాలకు విజ్ఞప్తి చేశాయి. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వివిధ దేశాలలో లక్షల సంఖ్యలో నమోదవుతున్నాయి. ఇటీవల భారతదేశంలో కూడా ఈ కేసులు భారీగా వెలుగు చూస్తున్నాయి.
తాజాగా ప్రభుత్వం ప్రకటించిన గణాంకాల ప్రకారం... కేసులు భారత్లో సుమారు 400 పైగా నమోదయ్యాయి. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు పలు సూచనలు చేసింది. ముఖ్యంగా పర్యాటక ప్రాంతాలకు సంబంధించి ఆంక్షలను కఠినతరం చేయాలని రాష్ట్రాలకు చెప్పింది.
ఈ నేపథ్యంలోనే అన్ని రాష్ట్రాలు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్లోని తిరుమల తిరుపతి దేవస్థానం కూడా ఆంక్షలను అమలు చేయడంలో కీలక నిర్ణయం తీసుకుంది.
తిరుమల లో ఉండే వెంకటేశ్వర స్వామి ని చూసేందుకు వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా వస్తుంటారు ఈ నేపథ్యంలో వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉంటుందని అంచనా వేసిన ప్రభుత్వం గతంలో లాగే ఇప్పుడు కూడా ఆర్ టిపిసిఆర్ పరీక్షలను చేయించుకొని అందుకు సంబంధించిన సర్టిఫికెట్ ను చూపిస్తేనే అనుమతించాలని ఉత్తర్వులు జారీ చేసింది. లేకపోతే వ్యాక్సింగ్ కు సంబంధించిన రెండు డోసులను పూర్తి చేసుకున్నట్లు మరో సర్టిఫికేట్ ను దర్శనానికి వచ్చే భక్తులు చూపించాలని పేర్కొంది.
ఆర్ టిపిసిఆర్ పరీక్షలు చేయించుకున్న భక్తులు సర్టిఫికెట్ను దర్శనానికి ముందు చూపించాల్సి ఉంటుంది. అయితే ఈ సర్టిఫికెట్ దర్శనానికి కేవలం 48 గంటల ముందు చేయించుకుని ఉండాలని ఆలయ కమిటీ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. వీటిని అమలు చేసేందుకు ఆలయ సిబ్బంది తనిఖీలు చేస్తున్నారు. అయితే కొంతమంది భక్తులు మాత్రం ఉత్తర్వులను పట్టించుకోకుండా కొండ మీదకు వస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఆలయ అధికారులు మరో నిర్ణయం తీసుకున్నారు. తిరుమలకు చేరుకునే ముందు, తిరుపతి నుంచి వచ్చేటప్పుడు అలిపిరి చెక్ పోస్ట్ వద్ద ఉండే భద్రతా సిబ్బంది సర్టిఫికెట్ ను చూసి పైకి పంపించాలని నిర్ణయించారు.
ఈ విధంగా అలిపిరి చెక్ పోస్ట్ వద్ద వ్యాక్సిన్ సర్టిఫికెట్ను లేకపోతే ఆర్టిపిసిఆర్ పరీక్ష చేయించుకుని నెగిటివ్ వచ్చినట్లుగా సర్టిఫికెట్ను చూసిన తరువాత వారిని పైకి పంపించాలని అక్కడ ఉన్న భద్రతా సిబ్బందికి అధికారులు సూచించారు. దీంతో ఆదేశాలను అమలు చేస్తున్న భద్రతా సిబ్బంది సర్టిఫికేట్ లేకుండా వచ్చిన వారిని అలిపిరి చెక్ పాయింట్ వద్ద నిలిపి వేసి వెనక్కి పంపిస్తున్నారు. దేనితో మలయప్ప స్వామిని చూడాలని వచ్చిన భక్తులకు ఎదురు దెబ్బ తగులుతుంది.
దేశంలో కొత్త వేరియంట్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఆంక్షలను అమలు చేయక తప్పడం లేదని తితిదే పాలక మండలి తెలిపింది. భక్తుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. కరోనా వ్యాప్తిని అరికట్టే చర్యల్లో భాగంగా దీనిని అమలు చేస్తున్నట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు భక్తులు కూడా వాటిని పాటించాలని కోరింది.