ప్రముఖ ధార్మిక సంస్థ తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. ప్రపంచంలో అత్యంత సంపన్న దేవాలయంగా తిరుమలకు ఉన్న ప్రత్యేక గుర్తింపు అంతా ఇంతా కాదు. మామూలు రోజుల్లో ఈ ఆలయానికి వచ్చే భక్తులతో వచ్చే ఆదాయం దగ్గర దగ్గర రూ.2కోట్ల వరకూ ఉంటుంది. పలు ధార్మిక కార్యక్రమాల కోసం పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేస్తుంటారు.
ఇదిలా ఉంటే.. కరోనా విరుచుకు పడుతన్న వేళ.. ఎవరికి వారు వారికి తోచినట్లుగా తాము చేయగలిగిన సాయాన్ని ప్రకటిస్తున్నారు. ఇందులో భాగంగా టీటీడీ సైతం కరోనా రిలీఫ్ ఫండ్ ను ప్రకటించింది. అయితే.. ఆ ప్రకటన విస్మయానికి గురి చేసేలా మారింది. ఎందుకంటే.. ఎంతో సంపన్న ధార్మిక సంస్థ ప్రకటించిన విరాళం ఎంతో తెలుసా? అక్షరాల రూ.19 కోట్లు మాత్రమే. తాము ప్రకటించిన విరాళంలో రూ.8 కోట్లను ఇప్పటికే చిత్తూరు జిల్లా అధికారులకు అందజేయగా.. మిగిలిన రూ.11 కోట్లను రానున్న రోజుల్లో ఇవ్వనున్నారు. ఇదే కాకుండా అనునిత్యం 50వేల ఫుడ్ ప్యాకెట్లను సరఫరా చేస్తుంది.
తిరుమల కొండ మీద అతి పెద్ద భోజనశాల ఉందన్న విషయం తెలిసిందే. విడి రోజుల్లో కొండ మీదకు వచ్చే భక్తులకు భోజన సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తుంటారు. నిత్యం వేలాది మంది భోజనం చేస్తుంటారు. సంపదతో తులతూగే టీటీడీ లాంటి థార్మిక సంస్థ కరోనా వేళ.. కాస్త పెద్ద మనసు చేసుకొని పెద్ద మొత్తాన్ని విరాళంగా ఇచ్చి ఉంటే బాగుండేదంటున్నారు. ఇక..తిరుమల ఆలయంలో రోజువారీగా నిర్వహించాల్సిన పూజల్ని యథాతధంగా నిర్వహిస్తున్నప్పటికీ.. పలు పుకార్లు షికార్లు చేస్తున్నాయి.