తిరుమలేషుడికి ఇదే గుదిబండనట..

Update: 2019-08-16 06:33 GMT
అది అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి సన్నిధానం..  రోజూ కోట్ల మంది తరలివస్తుంటారు. కోట్ల రూపాయలను హుండీలో వేస్తుంటారు. మొక్కలు తీరిన వారు నిరుపేద చిల్లర వేస్తే.. సంపన్నులు కోట్లు స్వామి వారికి సమర్పిస్తారు. నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తూ.. ఇతర కార్యక్రమాలకు వినియోగిస్తున్న టీటీడీ.. భక్తులు వేసిన కోట్ల రూపాయల చిల్లర ను మాత్రం ఏం చేయాలో పాలుపోక ఆపసోపాలు పడుతోంది.

ఇప్పటికే టీటీడీ వద్ద కోట్ల రూపాయల చిల్లర వృథాగా పడి ఉంది. ఈ చిల్లరను ఏ బ్యాంకు తీసుకోవడానికి ముందుకు రావడం లేదు. ఎందుకంటే అంత భారీ మొత్తంలోని చిల్లరను స్టోర్ చేసే సామర్థ్యం కూడా బ్యాంకులు లేని పరిస్థితి ఉంది.

అందుకే ఇప్పుడు తిరుమలేషుడికి చిల్లర నాణేలు గుదిబండగా మారాయి. భక్తులు వేసిన చిల్లరను ఏం చేయాలతో తెలియక టీటీడీ సతమతమవుతోంది. కొన్నేళ్లుగా టీటీడీ చిల్లరను తీసుకునేందుకు బ్యాంకులు ముందుకు రాకపోవడంతో టీటీడీకి ఈ చిల్లరతో కోట్ల రూపాయల నష్టం వస్తోందట..

తాజాగా టీటీడీ స్పెషల్ ఆఫీసర్ ధర్మారెడ్డి బ్యాంకులకు బంపరాఫర్ ఇచ్చాడు. డిపాజిట్లు చేస్తామంటే ఆసక్తి చపే బ్యాంకులకు అదే డిపాజిట్ తో కొట్టాలని డిసైడ్ అయ్యారు. టీటీడీలోని చిల్లరను ఏ బ్యాంకు అయితే తీసుకొని నగదుగా జమ చేస్తుందో అంతే మొత్తంలో కరెన్సీ నోట్లను డిపాజిట్ చేస్తామని టీటీడీ ఆఫర్ ఇచ్చింది. అంటే 25 కోట్ల చిల్లర తీసుకుంటే 25 కోట్ల కరెన్సీ నగదును టీటీడీ డిపాజిట్ చేస్తుందన్న మాట.. ఇక చిల్లరను భారీగా కావాలనుకునే వ్యాపారులు కూడా టీటీడీపీ సంప్రదిస్తే వాటిని మార్పిడి చేసుకోవచ్చని తెలిపారు.ఇప్పటికే ఆర్బీఐ ఆదేశాలతో కేవలం ఆంధ్రాబ్యాంక్ మాత్రం ఈ చిల్లరను టీటీడీ నుంచి సేకరించి భద్రపరిచింది. ఇదే 25 కోట్లకు పైగానే ఉంది. సో ఇప్పుడు ఏ బ్యాంకు ముందుకు వస్తే ఆ బ్యాంకుకు చిల్లర అంటగట్టేస్తారన్న మాట.. ఇలా చిల్లర సమస్య తిరుమలేషుడికి గుదిబండగా మారిందట..
    

Tags:    

Similar News