ఒకరోగాన్ని తగ్గించడానికి ఒక మందు పనిచేస్తుందంటే.. ఆ రోగం ఏ ఊర్లో వచ్చినా సరే.. అదే మందును ప్రయోగిస్తే సరిపోతుంది. అయితే తెలంగాణలో అయితే ఒక మందు, ఆంధ్రప్రదేశ్ లో అయితే మరొక మందు పనిచేస్తుందని బుకాయించదలచుకుంటే ఎలా? అది ప్రజలను మభ్యపెట్టడమే అవుతుంది. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ అదే పనిచేస్తున్నది. అన్నదాతలు ఈ రెండు రాష్ట్రాల్లోనూ దాదాపుగా ప్రతిరోజూ ఆత్మహత్యలకు పాల్పడుతూనే ఉన్నారు. పరిస్థితులు ఏమాత్రం మెరుగుపడడం లేదు. రెండు రాష్ట్ర ప్రభుత్వాలూ తమకు చేతనైన చర్యలు తీసుకుంటూనే ఉన్నాయి. కానీ ఈ బలవన్మరణాలకు అడ్డుకట్ట పడడం లేదు. అయితే ఏపీలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ.. తెలంగాణలో ప్రతిపక్షంగా ఉంటూ.. ఆత్మహత్యలపై అక్కడి ప్రభుత్వంపై చెలరేగడానికి ఒక ఎజెండా సిద్ధం చేసుకున్నది.
ఏపీలో కూడా అదే తరహా ఆత్మహత్యల పరిస్థితులు ఉన్నప్పుడు.. అక్కడి ప్రభుత్వం ఎలాంటి ఉపశమన చర్యలతో ఉపక్రమిస్తున్నదో.. అదే తరహాలో.. తెలంగాణలోని పార్టీ తమ ప్రభుత్వంపై పోరాడితే వారికి మర్యాదగా ఉండేది. నిజం చెప్పాలంటే.. వారు అలాంటి ఎజెండాతోనే సర్కారుపై తమ పోరాటం ప్రారంభించారు. రైతు ఆత్మహత్యల అంశాన్ని లేవనెత్తుతూ... వారి కుటుంబాలకు 5 లక్షల వంతున పరిహారం ఇవ్వాలని తెతెదేపా నేతలు చాలా పెద్దఎత్తున డిమాండ్ చేశారు. ఆ మొత్తం ఏపీలో ఇస్తున్నదానితో సమానం.
అయితే కేసీఆర్ చైనానుంచి తిరిగి రాగానే.. మళ్లీ మళ్లీ ప్రతిపక్షాలు విమర్శించడానికి అవకాశం లేకుండా.. ఎక్స్ గ్రేషియాను వారు అడుగుతున్న 5 లక్షల కంటె ఎక్కువగా 6లక్షలు చేసేశారు. దీంతో నాలుగైదు రోజుల పాటూ ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో పడిపోయిన తెలంగాణ తెలుగుదేశం ఇప్పుడు కొత్త పాట అందుకున్నట్లున్నది. ఎక్స్‌గ్రేషియా చచ్చిపోయిన వారి కుటుంబాలను ఆదుకుంటున్నదే తప్ప.. చావుల్ని ఆపడం లేదంటూ విమర్శిస్తున్నది. రైతులు చావకుండా ఆపాలంటే.. రుణమాఫీని ఒకేసారి వారి బ్యాంకు అకౌంట్ లలో వేసేయాలని కొత్త డిమాండు వినిపిస్తున్నది. ఈ సూత్రం మంచిదే అనుకున్నప్పటికీ ఆ సిద్ధాంతం కేవలం తెలంగాణకు మాత్రమే వర్తిస్తుందా..? ఏపీలో రైతుల చావుల్ని అరికట్టడానికి ఈ మంత్రం పనిచేయదా? అని పలువురు ప్రశ్నిస్తున్నారు.
తెదేపా మాట్లాడుతున్న వైఖరిని గమనిస్తోంటే.. తెలంగాణ రైతుల ప్రాణాలు కాపాడడానికి కట్టుబడి, ఒకేసారి రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తున్నారని.. ఏపీ రైతులు ఎలా చచ్చినా పర్లేదని అనుకుంటున్నారని అనిపిస్తోంది.