తమిళనాడు రాజకీయాలు మళ్లీ మలుపు తిరగుతున్నాయి. సొంత కూటమితో హల్ చల్ చేసేందుకు,ఏకంగా సర్కారును అతలాకుతలం చేసేందుకు స్కెచ్ వేసిన అన్నాడీఎంకే చీలిక వర్గం నేత దినకరన్ వేసిన స్కెచ్ ఫలించేలా కనిపించడం లేదు. అన్నాడీఎంకే రాజకీయ పరిణామాలతో కర్ణాటకలోని కుడగు విడిదిలో ఉన్న టీటీవీ దినకరన్ వర్గీయులు ప్రస్తుతం రాష్ట్రానికి చేరుకున్నారు. పోలీసు కేసులు ఎదుర్కొంటున్న మాజీ మంత్రులు పళనియప్పన్, సెంథిల్ బాలాజీ అరెస్టుల భయంతో గత వారం విడిది నుంచి బయటకు వచ్చేశారు. తంగతమిళ్ సెల్వన్ తదితర 15 మంది మూడు రోజుల కిందట కుడగు విడిది ఖాళీ చేసి రాష్ట్రానికి తిరుగుముఖం పట్టారు.
ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామికి ఇచ్చిన మద్దతు వెనక్కు తీసుకుంటున్నట్లు గవర్నర్ కు కొద్దిరోజుల కిందట దినకరన్ వర్గానికి చెందిన 18 మంది ఎమ్మెల్యేలు లేఖలు సమర్పించగా ఆ తర్వాత వెట్రివేల్ మినహా మిగిలిన వారంతా మొదట పుదుచ్చేరిలో తర్వాత కర్ణాటకలోని కుడగు విడిదికి వెళ్లిన విషయం తెలిసిందే. వీరిపై సభాపతి అనర్హతవేటు వేసిన తర్వాత కూడా అక్కడ ఉండటం, టీటీవీ దినకరన్ వారితో చర్చలు జరపడం వంటి పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తి కలిగించాయి. రాష్ట్రానికి తిరిగి రావడానికి అనుమతించాలని తమ వర్గం నేతను కుడగు విడిదిలోని వారంతా కోరారని, దీనికి దినకరన్ స్పష్టమైన సమాధానమివ్వలేదని సమాచారం. ఈ నేపథ్యంలో చెన్నై అడయారులోని టీటీవీ దినకరన్ నివాసానికి చేరుకుని ఆయన్ను కలిసిన తర్వాత తమ సొంత ఊర్లకు తిరిగి వెళ్లారు. సుమారు రెండు నెలలు పాటు పుదుచ్చేరి - కుడగులో ఉన్న తర్వాత సొంత ప్రాంతాలకు వచ్చిన తమ నాయకులకు మద్దతుదారులు స్వాగతం పలికారు. కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు.
మరోవైపు తమిళనాడులోని సాలెంలో కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా కరపత్రాలు పంపిణీ చేసినందుకు ఎఐఎడిఎంకె బహిష్కృత నేత టీటీవీ దినకరన్ పై పోలీసులు ఎఫ్ ఐఆర్ నమోదు చేశారు. అలాగే మరొక 35 మంది నాయకులపై కూడా ఎఫ్ ఐఆర్ లు నమోదు చేశారు. కాంగా, ఈ సందర్భంగా దినకరన్ మీడియాతో మాట్లాడుతూ తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ జయలలిత అనారోగ్యానికి గురై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలోని వీడియో క్లిప్పింగ్ ను జ్యుడిషియల్ కమిషన్ కు అందజేస్తామని దినకరన్ చెప్పారు. తన మేనత్త శశికళ 15 రోజుల కోసం పెరోల్‌కు దరఖాస్తు చేసిందని ఆయన అన్నారు. అనారోగ్యానికి గురైన తన భర్తను చూడటం కోసం శశికళ పెరోల్ కు దరఖాస్తు చేసిందని దినకరన్ చెప్పారు.