ఆర్కేన‌గ‌ర్ లో దూసుకెళుతున్న దిన‌క‌ర‌న్‌!

Update: 2017-12-24 05:43 GMT
దేశమంతా ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న ఆర్కేన‌గ‌ర్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు విష‌యంలో నాట‌కీయ ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి. అమ్మ జ‌య‌ల‌లిత మ‌ర‌ణంతో ఖాళీ అయిన ఆర్కేన‌గ‌ర్‌కు ఉప ఎన్నిక నిర్వ‌హించే విష‌యంలో ఇప్ప‌టికే ప‌లు ఆస‌క్తిక‌ర ప‌రిణామాలు చోటు చేసుకున్న సంగ‌తి తెలిసిందే.

ఒక‌సారి ఉప ఎన్నిక‌ను వాయిదా వేసి.. రెండో ద‌ఫా నిర్వ‌హించిన ఉప ఎన్నిక‌ల ఓట్ల లెక్కింపు ఈ రోజు దుయం 8 గంట‌ల‌కు చెన్నైలోని క్వీన్ మేరీస్ కాలేజీలో మొద‌లైంది. ఓట్ల లెక్కింపు ముందు ఎన్నిక‌ల బ‌రిలో నిలిచిన ఇండిపెండెంట్ అభ్య‌ర్థుల్ని లోప‌ల‌కు అనుమ‌తించే విష‌యంలో పోలీసులు నిరాక‌రించ‌టంతో ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి.

ఈ ఉప ఎన్నిక‌ల్లో శ‌శిక‌ళ వ‌ర్గానికి చెందిన దిన‌క‌ర‌న్ తో పాటు.. అధికార అన్నాడీఎంకే.. డీఎంకే.. బీజేపీ స‌హా పెద్ద ఎత్తున ఇండిపెండెంట్ అభ్య‌ర్థులు బ‌రిలో నిలిచారు. ఇదిలా ఉండ‌గా.. ఓట్ల లెక్కింపు తొలి రౌండ్ పూర్తి అయ్యేస‌రికి దిన‌క‌ర‌న్ 2వేల ఓట్ల‌కు పైగా అధిక్యంతో ఉండ‌గా.. త‌ర్వాతి రౌండ్ల‌లోనూ దిన‌క‌ర‌న్ అధిక్యంతో దూసుకెళుతున్నారు. తాజాగా దిన‌క‌ర‌న్‌కు 7226.. అన్నాడీఎంకే అభ్య‌ర్థికి 2738.. డీఎంకే అభ్య‌ర్థికి 1138 ఓట్లు పోల‌యిన‌ట్లుగా తెలుస్తోంది.

ఇదిలా ఉండ‌గా.. కౌంటింగ్ ద‌గ్గ‌ర శ‌శిక‌ళ వ‌ర్గం.. అన్నాడీఎంకే.. డీఎంకే వ‌ర్గం మ‌ధ్య చోటు చేసుకున్న వివాదంతో గంద‌ర‌గోళ ప‌రిస్థితులు చోటు చేసుకున్నాయి. దీంతో.. ఓట్ల లెక్కింపును తాత్కాలికంగా నిలిపివేశారు.

ప‌రిస్థితిని చ‌క్క‌దిద్దేందుకు పారామిలిట‌రీ బ‌ల‌గాలు రంగంలోక దిగాయి. దీంతో.. ప‌రిస్థితి చ‌క్క‌బ‌డింది. గంద‌ర‌గోళం నేప‌థ్యంలో ఈవీఎంల‌కు ఎలాంటి న‌ష్టం వాటిల్ల‌లేద‌ని క‌మిష‌న‌ర్ ఆఫ్ పోలీస్ విశ్వ‌నాథ‌న్ ప్ర‌క‌టింఆరు. ఓట్ల లెక్కింపులో ఇప్ప‌టివ‌ర‌కూ దిన‌క‌ర‌న్ అధిక్యంలో నిలిచారు.
Tags:    

Similar News