ఎన్నికల కమీషన్ కు రూ.50 కోట్లు లంచం ఇవ్వడానికి ప్రయత్నించిన కేసులో అన్నాడీఎంకే నాయకుడు, మాజీ ఎంపీ టీటీవీ దినకరన్ నిండా మునిగిపోయిన సంగతి తెలిసిందే. ఇప్పుడా కేసుకు విజయవాడతోనూ సంబంధం ఏర్పడడంతో ఒక్కసారిగా ఏపీలోనూ అలజడి మొదలైంది. ఈ కేసులో దినకరన్ ను అరెస్టు చేసిన ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు ఆయన్ను చెన్నైకి తీసుకు వచ్చి విచారణ చేస్తున్నారు. తాజాగా సీను విజయవాడకు మారుతోంది.
టీటీవీ దినకరన్ చెన్నై - బెంగళూరు - చెన్నై కేంద్రాలుగా ఎన్నికల యంత్రాంగానికి లంచం ఎర వేశారని ఢిల్లీ అధికారులు గుర్తించారు. అయితే ఆయన్ను చెన్నై పోలీసులు చెన్నై తీసుకు వచ్చి విచారణ చేసిన తరువాతే అసలు విషయం వెలుగు చూసింది. ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ నుంచి ఆయన అసలు వ్యవహారం మొదలు పెట్టారని తెలుసుకున్న ఢిల్లీ పోలీసులు షాకయ్యారట. వెంటనే టీటీవీ దినకరన్ ను విజయవాడ తీసుకు వెళ్లి విచారణ చెయ్యడానికి ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు బయలుదేరారు.
టీటీవీ దినకరన్ హవాల సోమ్మును ఎన్నికల కమిషన్ కు ఎర వేసిన వ్యవహారంలో నరేశ్ అనే హవాలా ఆపరేటర్ ను దిల్లీ ఎయిర్ పోర్టులో శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో అరెస్టయిన దళారి సుఖేశ్ చంద్రశేఖర్ కు నగదు బదిలీ చేయడంలో నరేశ్ హస్తం ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. తాజాగా ఆయన్ను అరెస్టు చేశారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/