భారతదేశం సత్తా చాటేలా గత ఏడాది సెప్టెంబర్ 29న పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ లో భారత ఆర్మీ నిర్వహించిన సర్జికల్ దాడుల వెనుక దాగి ఉన్న కోణాన్ని మాజీ రక్షణశాఖ మంత్రి మనోహర్ పారికర్ వెల్లడించారు. అవమానకర రీతిలో ఓ టీవీ యాంకర్ వేసిన ప్రశ్నవల్లే పీవోకేపై సర్జికల్ దాడులు నిర్వహించాల్సి వచ్చిందన్నారు. పీవోకేలో జరిగిన సర్జికల్ దాడులకు 15 నెలలు ముందుగానే ప్లానేయాల్సి వచ్చిందన్నారు. గోవాలో పారిశ్రామికవేత్తలతో జరిగిన ఓ సమావేశంలో మాట్లాడుతూ సీఎం పారికర్ ఈ విషయాన్ని వెల్లడించారు.
వాస్తవానికి మయన్మార్ బోర్డర్ వద్ద 2015, జూన్ 4వ తేదీన భారత ఆర్మీపై మిలిటెంట్లు ఆకస్మిక దాడి చేశారు. ఆ ఘటనలో 18 మంది భారత జవాన్లు మృత్యువాతపడ్డారు. దీనికి బదులుగా భారత ఆర్మీ ప్రతిదాడికి ప్లానేసింది. చాలా రహస్యంగా మిలిటెంట్లపై అటాక్ చేసి సుమారు 80 మందిని హతమార్చింది. ఇదే భారత ఆర్మీ నిర్వహించిన మొట్ట మొదటి సర్జికల్ స్ట్రయిక్. అయితే ఈ ఘటన జరిగినప్పుడు మరో కేంద్ర మంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ మీడియాతో మాట్లాడారు. మయన్మార్ బోర్డర్ దగ్గర జరుగుతున్న ఆపరేషన్ గురించి వివరిస్తున్న సందర్భంలో ఓ టీవీ యాంకర్ ఇలాంటి దాడే పశ్చిమ సరిహద్దు దగ్గర చేయగలరా అని ప్రశ్నించారు. ఆ ఇంటర్వ్యూను టీవీలో చూసిన అప్పటి రక్షణ మంత్రి పారికర్ ఆ ప్రశ్నను అవమానకరంగా భావించారు.
చాలా సుదీర్ఘంగా ఆలోచించిన తర్వాత 2015, జూన్ 9న ఎల్వోసీ వద్ద సర్జికల్ దాడులు చేయాల్సిన ఆలోచనకు వచ్చినట్లు పారికర్ చెప్పారు. దాని కారణంగానే 2016, సెప్టెంబర్ 29న పీవోకేలో సర్జికల్ దాడులు నిర్వహించినట్లు ఆయన తెలియజేశారు. 15 నెలల ప్లాన్ తర్వాత సర్జికల్ దాడి సక్సెస్ అయ్యిందన్నారు. దీని కోసం ప్రత్యేక శిక్షణ బృందాలను ఏర్పాటు చేశామన్నారు. అవసరానికి తగ్గట్టుగా ఆయుధాలను సమకూర్చామన్నారు. పాకిస్థాన్ ఆర్మీ ఫైరింగ్ యూనిట్లను గుర్తించేందుకు డీఆర్ డీవో అభివృద్ధి చేసిన స్వాతి వెపన్ రాడార్లను వాడినట్లు ఆయన చెప్పారు. ఆ రాడార్ల వల్లే సుమారు 40 పాకిస్థాన్ ఫైరింగ్ యూనిట్లు ధ్వంసమైనట్లు పారికర్ వివరించారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/