బాలీవుడ్ యాక్షన్ హీరో భార్య.. ఒకప్పటి హీరోయిన్ ట్వింకిల్ ఖన్నాకు ఏం తోచక ఓ అనవసర వివాదంలో వేలు పెట్టింది. ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు.. ఆధ్యాత్మిక గురువు శ్రీ శ్రీ రవిశంకర్ మీద ఆమె ట్విట్టర్లో చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి. సినిమాలకు గుడ్ బై చెప్పేశాక కుటుంబ జీవనానికే ప్రాధాన్యమిచ్చిన ట్వింకిల్ అప్పుడప్పుడూ పత్రికల్లో కాలమ్స్ అవీ రాస్తుంటుంది.
ట్విట్టర్లోనూ కొన్ని ఆసక్తికర పోస్టులు పెడుతూ.. కామెంట్లు చేస్తుంటుంది. ఐతే ఈ మధ్య ఆమె దృష్టి ఎందుకు రవిశంకర్ మీదికి వెళ్లిందో కానీ.. ‘‘శ్రీ శ్రీ రవిశంకర్ ఉదాత్తమైన ఆలోచనలు ఉన్నవారు. ఐతే ఆయనకు యోగా చేసే విధానం ఇబ్బందికరంగా ఉంటుంది. యోగా చేసేటప్పుడు ఆయన సగం గడ్డం నోటిలోకే వెళ్తుంది. ఈ విషయంలో రాందేవ్ బాబా పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు’’ అని ట్వీట్ చేసింది ట్వింకిల్. అంతటితో ఆగకుండా.. ఆ ట్వీట్ కు ‘హోలీ మెన్ అండ్ హెయిరీ టేల్స్’ అంటూ ఓ హ్యాష్ ట్యాగ్ కూడా జోడించింది.
ఈ ట్వీట్ రవిశంకర్ అభిమానుల మనోభావాల్ని దెబ్బ తీసింది. దీంతో ఆమెను తిట్టిపోస్తూ ట్వీట్లు గుప్పించారు వాళ్లంతా. అంతటితో ఆగకుండా ట్వింకిల్ పెట్టిన ట్వీట్ కు నిరసనగా.. ఆమె భర్త నటించిన ‘హౌస్ఫుల్-3’ సినిమాను బహిష్కరిస్తామని కూడా హెచ్చరించారు. దీంతో ట్వింకిల్ తప్పయిపోయిందంటూ లెంపలేసుకుంది. వెంటనే తన ట్వీట్ తీసేసి.. ‘‘ఎవరి మనోభావాలను దెబ్బతీసే ఉద్దేశం నాకు లేదు. అది కేవలం జోక్ మాత్రమే. పొరపాటు చేసి ఉంటే దిద్దుకుంటాను’’ అని వివరణ ఇచ్చింది. ఐతే తన భర్త సినిమాను బహిష్కరిస్తామని చేసిన హెచ్చరికల్ని ఆమె తప్పుబట్టింది. రవిశంకర్ మీకు ఇదే నేర్పిస్తున్నారా అని విమర్శించింది.