కొన్నిసార్లు గమ్మత్తు సంఘటలు భలే జరిగిపోతుంటాయి. కొత్త సంవత్సరం వేళ.. అలాంటి చిత్రమైన ఘటన ఒకటి అమెరికాలో చోటు చేసుకుంది. శాండిగోకు చెందిన లూయిస్.. మారిబెల్ దంపతుల వ్యవహారం ఇప్పుడు అందరికి ఆసక్తికరంగా మారింది. లూయిస్ నేవీలో పని చేస్తుంటే.. వలెన్షియా శాండిగో అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్ లో క్యాషియర్ గా పని చేస్తోంది.
నిండుగర్భిణి అయిన మారిబెల్ ను డిసెంబరు 31న ఆసుపత్రిలో చేర్చారు. నొప్పులు పెరిగి.. సరిగ్గా అర్థరాత్రి 11.59 గంటల సమయంలో పండంటి పాపకు జన్మనిచ్చారు. కవలలు పుట్టాల్సిన వేళ.. రెండో డెలివరీ కోసం వెయిట్ చేస్తుంటే.. మూడు నిమిషాల ఆలస్యంగా బాబు పుట్టాడు. ఈ మూడు నిమిషాలతో.. తన అక్క కంటే తమ్ముడి డేటాఫ్ బర్త్ ఏడాది పూర్తిగా మారిపోయింది.
అక్క 2015 డిసెంబరు 31 అయితే.. తమ్ముడు 2016 జనవరి 1గా మారింది. దీంతో.. కవలలుగా పుట్టినా.. మూడు నిమిషాల తేడా పుణ్యమా అని ఇద్దరూ వేర్వేరు సంవత్సరాల్లో పుట్టిన వారయ్యారు. పేరుకు కవలలు అయినా.. వారు పుట్టిన ఏడాదులుమారిపోయాయి. అంతేకాదు.. శాండిగోలో 2016లో పుట్టిన తొలి బిడ్డగా ఈ పిల్లాడు అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఈ విచిత్రమైన ఉదంతం ఇప్పుడు అందరిని అమితంగా ఆకర్షిస్తోంది.