భారతదేశ ప్రధాని ప్రయాణించే విమానం ఎప్పటిదో తెలుసా? అక్షరాల పాతికేళ్ల క్రితం నాటిది. ప్రస్తుతం వీవీఐపీలకు వినియోగించేందుకు ఆరు బోయింగ్ 777 విమానాలు ఉన్నాయి. అవన్నీ రెండున్నర దశాబ్దాల నాటివిగా చెబుతున్నారు. ఇలాంటివేళ.. అత్యాధునిక సాంకేతికతతో తయారు చేయించిన విమానాల్ని తాజాగా కొనుగోలు చేయనున్నారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్.. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీలు ప్రయాణించేందుకు వీలుగా క్షిపణి దుర్భధ్యమైన విమానాలకు సంబంధించిన ఫస్ట్ లుక్ రివీల్ చేశారు.
అమెరికా అధ్యక్షుడు ప్రయాణించే ఎయిర్ ఫోర్స్ వన్ కు ధీటైన రీతిలో ఉన్న ఈ విమానం ఖరీదైనదిగా చెబుతున్నారు. ఈ విమానాల కోసం రూ.8458 కోట్ల మొత్తాన్ని ఖర్చు చేయనున్నారు. ఈ విమానాల్లో ఉండే మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ ఖరీదే సుమారు రూ.1435.19 కోట్లు ఉంటుందని చెబుతున్నారు. విమానం ముందు భాగంలో శక్లివంతమైన జామర్ తో పాటు మూడు యాంటెనాలు ఉంటాయి. వీటితో క్షిపణిదాడుల్ని నిలువరించే వీలు ఉంటుంది.
మూడేళ్ల క్రితం కొనుగోలు చేసిన రెండు బోయింగ్ 777 - 300 ఈఆర్ విమానాలకు అమెరికా సాయంతో అత్యంత పటిష్ట భద్రతను జోడిస్తున్నారు. వీటిలో మొదటి విమానం ఆగస్టు చివరికి.. రెండోది సెప్టెంబరులో భారత్ కు రానున్నాయి. ఇప్పుడు వినియోగిస్తున్న విమానాలకు.. త్వరలో రానున్న కొత్త విమానాల్లో తేడాల్ని చూస్తే.. పాతదాన్లో నాలుగు ఇంజిన్లు ఉంటే.. ఇందులో రెండే ఉంటాయి. పాత దాన్లో మూడు ఇంజిన్లు పాడైనా ఒకదానితో నడిపే వీలుంది. కొత్త దాన్లో మాత్రం ఒకటి పాడైనా టెన్షన్ తప్పదు. ఇది తప్పించి మిగిలిన ఏ ఫీచర్ ను వంక పెట్టలేని రీతిలో ఉన్నాయి.
పాత విమానంలో నాన్ స్టాప్ గా 12 గంటలు ప్రయాణించే వీలుంటే.. కొత్త విమానంలో 18 గంటల పాటు ప్రయాణించే వీలుంది. పాత విమానంలో మధ్యలో ఇంధనం కోసం దిగాల్సి ఉంది. కొత్త వాటిల్లో మాత్రం గాల్లోనే ఇంధనాన్ని నింపుకునే సౌకర్యం ఉంుటంది. ఇప్పుడు వినియోగిస్తున్న విమానాల్లో నేరుగాఅమెరికాకు వెళ్లే వీలు లేదు. కొత్త విమానంలో ఆ సౌకర్యం ఉంటుంది. అన్ని బాగున్నట్లు ఉన్నా.. విమాన ఇంజిన్ల విషయంలో ఉన్న విషయాన్ని ఏ ప్రాతిపదికన ఓకే చేశారన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది.