సినిమా రంగంకు చెందిన పలువురు ఈసారి పార్లమెంటు ఎన్నికల బరిలో నిలవడంతో పాటు - ఎన్నికల బరిలో ఉన్న వారికి మద్దతు తెలుపుతున్నారు. కర్ణాటకలో సీఎం కుమారస్వామి తనయుడు - యంగ్ హీరో నిఖిల్ కుమార స్వామి మాండ్య లోక్ సభ నియోజక వర్గం నుండి పోటీ చేసేందుకు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. కర్ణాటక మొత్తం కూడా ఈ పార్లమెంటు నియోజకవర్గం వైపు ఆసక్తిగా చూస్తోంది. కేవలం కర్ణాటక మాత్రమే కాకుండా తెలుగు రాష్ట్రాలు - తమిళనాడు కూడా మాండ్య నియోజక వర్గంపై ఆసక్తిని కనబర్చుతున్నాయి. ఈ ఎన్నికల్లో సుమలత అదే నియోజక వర్గం నుండి స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న విషయం తెల్సిందే.
మాండ్యా నియోజక వర్గంలో పోరు హోరా హోరీగా ఉన్న నేపథ్యంలో చిన్న విషయం కూడా చాలా పెద్దగా చర్చ జరుగుతుంది. నిఖిల్ నామినేషన్ సందర్బంగా 8 లక్షలకు పైగా ప్రైవేట్ ఆస్తుల ద్వంసం జరిగిందని - జేడీఎస్ కార్యకర్తలు నామినేషన్ సందర్బంగా కావేరీ గార్డెన్ లోని పూల కుండీలను ద్వంసం చేయడంతో పాటు - గార్డెన్ లో పలు వస్తువులు నాశనం చేశారని - మొత్తం వారు 8 లక్షల వరకు నష్టపర్చారు అంటూ పోలీసులకు ఫిర్యాదు అందింది.
ఆస్తుల నష్టం ఒక్కటే కాకుండా మరో రెండు ఎఫ్ ఐఆర్ లు కూడా నిఖిల్ పై నమోదు అయినట్లుగా తెలుస్తోంది. ఈ కేసుల్లో నిఖిల్ దోషిగా తేలితే మాత్రం ఆయన తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. చాలా కష్టపడి ఒక వేళ మాండ్యాను గెలుచుకున్నా ఆ తర్వాత పరిణామాలతో పదవి పోయే అవకాశం కూడా లేకపోలేదు అంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి యంగ్ హీరో నిఖిల్ హాయిగా సినిమాలు చేసుకుని - హీరోయిన్స్ తో డ్యూయేట్స్ వేసుకోక రాజకీయాల్లోకి వచ్చి కష్టాలు పడుతున్నాడు అంటూ స్థానిక నాయకులు నిఖిల్ ను పాపం అంటున్నారు.