బిగ్ బీ బండారం మరోసారి బట్టబయలు

Update: 2016-04-21 06:51 GMT
ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పనామా పేపర్స్ కుంభకోణంలో భారత్ కు చెందిన పలువురు ప్రముఖుల పేర్లు వినిపించటం తెలిసిందే. ఈ జాబితాలో బాలీవుడ్ దిగ్గజం.. బిగ్ బి అమితాబ్ బచ్చన్.. ఆయన కోడలు ఐశ్వర్యారాయ్ బచ్చన్ పేర్లు వినిపించాయి. ఈ కుంభకోణంలో తమ పేర్లు రావటంపై వారు వేర్వేరుగా ఖండించటం తెలిసిందే. తమను అప్రదిష్ట పాలు చేస్తున్నారంటూ వారు తెగ ఫీలయ్యారు కూడా.

అయితే.. బిగ్ బీ మీద తాజాగా మరో కథనం ప్రముఖ మీడియా సంస్థలో రావటం ఇప్పుడు సంచలనంగా మారింది. పాత ఆరోపణలకు కొత్త సాక్ష్యాల్ని చూపిస్తూ.. పనామా పేపర్స్ లో పేర్కొన్నట్లుగా బిగ్ బీ తప్పు చేసినట్లుగా తేల్చింది. పన్ను చెల్లించకుండా డబ్బును దేశం దాటించి విదేశీ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన వైనాన్ని తాజాగా బయట పెట్టటమే కాదు.. ఆ ఆరోపణలకు సంబంధించిన వివరాల్ని వెల్లడించటం ఇప్పుడు సంచలనంగా మారింది. అమితాబ్ పేర్కొన్నట్లు ఆయన పేరును తప్పుగా వాడలేదన్న వాస్తవాన్ని సదరు మీడియా సంస్థ తన తాజా కథనంలో పేర్కొంది.

సీబుల్క్ షిప్పింగ్ కంపెనీ లిమిటెడ్?. లేడీ షిప్పింగ్ లిమిటెడ్.. ట్రెజర్ షిప్పింగ్ లిమిటెడ్.. ట్రాంప్ షిప్పింగ్ కంపెనీల్లో బిగ్ బి డైరెక్టర్ గా పని చేశారన్న విషయాన్ని స్పష్టం చేయటమే కాదు.. ఆయన విదేశీ సంస్థల బోర్డు సమావేశాల్లో టెలిఫోన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారని పేర్కొంది. ఇందుకు సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని వెల్లడించింది. 1994 డిసెంబరు 12న జరిగిన సీ బుల్క్ షిప్పింగ్ కంపెనీ డైరెక్టర్ గా బోర్డు సమావేశాల్లో పాల్గొన్న విషయాన్ని వెల్లడించింది. గతంతో పోలిస్తే.. మరింత డీటైల్డ్ గా అమితాబ్ తప్పులకు సంబంధించిన విషయాల్ని బయటపెట్టిన నేపథ్యంలో ఆయన ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
Tags:    

Similar News