జగన్ కు షాక్ ఇవ్వబోతున్న ఆ ఇద్దరు ‘ఎంపీలు’ ఎవరు?

Update: 2020-09-05 00:30 GMT
రెండు అధికారంలో ఉన్న పార్టీలే.. కేంద్రంలో, రాష్ట్రంలో పరస్పరం సహకరించుకుంటున్నాయి. కానీ ఇప్పుడు బీజేపీ, వైసీపీ మధ్య స్నేహపూర్వక వాతావరణం చెడిపోయే ప్రమాదం వాటిల్లబోతోందట.. ఇద్దరు వైసీపీ ఎంపీలు తమ ఆర్థిక ప్రయోజనాల కోసం బీజేపీలో చేరాలని చూడడంతో ఈ రెండు పార్టీల మధ్య చిచ్చు రేగడం ఖాయంగా కనిపిస్తోంది. అది ముఖ్యంగా ఏపీ ప్రభుత్వానికే నష్టం చేకూర్చే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

త్వరలోనే ఇద్దరు వైసీపీ ఎంపీలు.. వైసీపీ అధినేత, సీఎం జగన్ కు షాక్ ఇవ్వబోతున్నారని ఢిల్లీ మీడియా వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ మేరకు వార్తలు వెలువడుతున్నాయి. ఒక ఎంపీ ఉత్తర భారత్ లో పెద్ద ఎత్తున కాంట్రాక్టులు చేస్తున్నాడని.. బిల్స్ పెద్ద ఎత్తున ఆగిపోయాయని టాక్. ఈ కరోనా కష్టకాలంలో ఇప్పుడు బిల్స్ వస్తాయా? రావా? అని ఆ ఎంపీ కొంతమందిని సంప్రదించినట్టు తెలిసింది. బీజేపీతో టచ్ లోకి వెళితే బిల్స్ అవే వస్తాయని సలహాలు ఇచ్చారట..

ఇంకొక ఎంపీ బీజేపీ వాళ్లతో టచ్ లోకి వెళ్లి ప్లానింగ్ కమిషనర్ మెంబర్ కావాలని కలలుగంటున్నాడట.. ఆ మెంబర్ అయితే లోన్స్ బాగా మంజూరు చేసుకోవచ్చని కూడా అతడు ప్లాన్ చేశాడంట..

ఎలాగూ ఆ ఎంపీలకు జగన్ ఇంతవరకు అపాయింట్ మెంట్ ఇవ్వలేదని అంటున్నారు. వాళ్లే అడగలేదని ప్రభుత్వం తరుఫున వాదన వినిపిస్తోంది. వాళ్లు బీజేపీలోకి వెళ్లడం ఖాయమని.. ఆ ఇద్దరు ఎంపీలు బీజేపీకి టచ్ లో ఉన్నారని పెద్ద ఎత్తున టాక్ నడుస్తోంది.

ఒక వేళ ఆ ఎంపీలు బీజేపీలోకి టచ్ లోకి వస్తే.. వైసీపీకి కొంత ఇబ్బంది అయ్యి.. బీజేపీ ప్రభుత్వంతో సంబంధాలు దెబ్బతింటాయనే భయం వైసీపీ ప్రభుత్వంలో ఉంది. ప్రస్తుతం ఏపీ ఆర్థిక కష్టాల్లో ఉందని.. వైసీపీ ఎంపీల వల్ల బీజేపీతో గొడవ మొదలైతే ఇంకా ఆర్థికంగా దెబ్బ తింటోందని కూడా అంటున్నారు.
Tags:    

Similar News