మోడల్ తో ఆ దేశ ప్రధాని వివాహేతర సంబంధం?

Update: 2019-10-01 06:27 GMT
ఎంత వారలైనా కాంత దాసులే అన్న సామెత కొన్ని యాంగిల్స్ లో ఓకే కానీ.. వివాహేతర సంబంధాలు.. గుట్టు చప్పుడు కాకుండా ప్రేమాయణాలతోనే తిప్పలన్ని. అందునా అత్యుత్తమ స్థానాల్లో ఉండే వారికి సంబంధించి ఇలాంటివి ఏమైనా ఉంటే వచ్చే తలనొప్పులు అన్ని ఇన్ని కావు. తాజాగా బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఇప్పుడు ఈ తరహాలోనే సంచలన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

ఒక మోడల్ తో ఆయనకు వివాహేతర సంబంధం ఉందన్నది తాజా ఆరోపణ. ఈ విషయాన్ని సదరు మాజీ మోడల్ కమ్ బిజినెస్ ఉమెన్ అయిన జెనిఫర్ అర్య్కూరీ తన సన్నిహితులైన స్నేహితులతో చెప్పినట్లుగా చెబుతున్నారు. అయితే.. ఈ వివాహేతర సంబంధం ఇప్పటిది కాదని.. ఆయన లండన్ మేయర్ గా ఉన్నప్పుడు చోటు చేసుకున్నట్లుగా బయటకు వచ్చింది.

బోరిస్ తో తన శృంగారం నిజమేనని జెనిఫర్ తన స్నేహితులతో చెప్పగా.. వారు ఇదే విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో వెల్లడించటంతో ఇప్పుడీ అంశం బ్రిటన్ లో పెను దుమారంగా మారింది. అమెరికాకు చెందిన ఈ మోడల్ తో న్యూయార్క్ నగరంలో శృంగారంతో ఒక్కటైనట్లుగా ఆమె స్నేహితురాలు తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇదిలా ఉంటే..లండన్ మేయర్ గా వ్యవహరించిన సమయంలో బోరిస్ జాన్సన్ తన ప్రియురాలైన జెనిఫర్ కు కోటికి పైగా ప్రజాధనాన్ని దోచి పెట్టినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. మరీ.. వివాదం నుంచి బ్రిటన్ ప్రధాని ఏ రీతిలో బయటపడతారో చూడాలి.
Tags:    

Similar News