సంక్షుభిత అఫ్గానిస్తాన్ నుంచి బయటపడాలని అనుకుంటున్నవారికి సహకరిస్తామని ప్రపంచ నాయకులు చెప్పారు. కానీ, వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉంటున్నాయి. దేశాల సరిహద్దుల్లో కంచెలు పెద్దవవుతున్నాయి. మరి, శరణార్థులను ఆదుకోవడానికి ఏం చేస్తున్నారు,అంతర్జాతీయ వలసల సంక్షోభం ముంచుకొస్తోందా, అఫ్గానిస్తాన్, పాకిస్తాన్ సరిహద్దులో పరిస్థితులు సాధారణంగానే ఉన్నట్లు పైకి కనిపిస్తున్నా, దగ్గరగా చూస్తే పరిస్థితులు ఎంత మారాయో అర్థమవుతుంది. కొద్దిరోజుల కిందట వందలాది మంది అఫ్గాన్ పౌరులు తీవ్ర భయాందోళనలతో సరిహద్దు పట్టణం టోర్ఖామ్ వద్ద చేరారు.కానీ, వారిలో వ్యాపారులు, సరైన పత్రాలు ఉన్నవారిని మాత్రమే అనుమతించారు.
పాకిస్తాన్ సరిహద్దులోని అధికారులు మాట్లాడుతూ, తమ దేశంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించే వారి డాక్యుమెంట్ల పరిశీలన విధానాలను మరింత కట్టుదిట్టం చేసినట్లు చెప్పారు. యునైటెడ్ నేషన్స్ హైకమిషనర్ ఫర్ రెఫ్యూజీస్ గణాంకాల ప్రకారం పాకిస్తాన్ లో ఇప్పటికే 14 లక్షలమంది రిజిష్టర్డ్ అఫ్గాన్ శరణార్థులు దశాబ్దాలుగా ఉంటున్నారు. అనధికారికంగా కూడా అంతే సంఖ్యలో అఫ్గాన్ శరణార్థులు పాకిస్తాన్ లో ఉంటారని అంచనా. తాలిబాన్‌లు అఫ్గానిస్తాన్ ను స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి పెద్ద ఎత్తున చోటు చేసుకోబోయే వలసలను అరికట్టేందుకు ప్రభుత్వాలు చర్యలు ప్రారంభించాయి. అఫ్గానిస్తాన్ పాస్ పోర్టులున్న 7,80,000 మంది అఫ్గాన్ పౌరులు ఇరాన్ లో ఇప్పటికే ఉండగా ఆ దేశం ఇకపై ఎవరినీ అనుమతించొద్దని, తిప్పి పంపించేయమని తన సరిహద్దు భద్రతాధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు యూఎన్ హెచ్ సీఆర్ వెల్లడించింది.
అమెరికా, మిత్ర దేశాల 20 ఏళ్ల మిలటరీ ఆపరేషన్‌లో దుబాసీలుగా, ఇతర పనుల్లో సహాయపడిన వేలాది మంది అఫ్గాన్ పౌరులను, వారి కుటుంబాలను అమెరికా, యూరప్ దేశాలు అక్కడి నుంచి సురక్షితంగా తరలిస్తున్నాయి. అఫ్గానిస్తాన్‌లో తమకు సహకరిచిన వారు, వారి కుటుంబసభ్యుల కోసం అమెరికా 26,000 స్పెషల్ ఇమిగ్రెంట్ వీసాలు కేటాయించింది. గత 24 గంటల్లో అమెరికా సైనిక విమానాలు సుమారు 2 వేల మందిని తరలించాయని అమెరికా డిప్యూటీ సెక్రటరీ వెండి షెర్మాన్ చెప్పారు.
తాలిబన్ల నుంచి తప్పించుకునేందుకు దేశం విడిచిపారిపోతున్న అఫ్గాన్ జాతీయులకు ఆశ్రయం కల్పించే యోచనలో భారత్ ఉన్నట్టు తెలుస్తోంది. ఈ శరణార్థులను ఆదుకునేందుకు కేంద్రం ఓ ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్టు జాతీయ మీడియాలో వార్తాకథనాలు వెలువడుతున్నాయి. ముఖ్యంగా..శరణార్థులు ఏ మతానికి చెందినవారన్నదానితో నిమిత్తం లేకుండా భారత మద్దతుదారులకు ఆశ్రయం కల్పించాలనేది కేంద్రం అభిమతమని సమాచారం. ఆఫ్గానిస్థాన్‌లో పరిస్థితిని ఎలా నియంత్రించాలనే విషయమై కటార్ గురువారం ఓ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశానికి భారత్ కూడా హాజరయ్యింది. కేంద్ర ప్రభుత్వం తరఫున విదేశాంగ శాఖ కీలక అధికారి జేపీ సింగ్ పాల్గొన్నారు.
ఇదిలా ఉంటే తాజాగా ఆఫ్ఘనిస్తాన్ శరణార్థులను ఆదుకునేందుకు యునైటెడ్ కింగ్ డమ్ (యూకే ) ముందుకు వచ్చింది. ఆఫ్ఘనిస్తాన్ శరణార్థుల కోసం పునరావాసా కేంద్రాలని ఏర్పాటు చేయబోతున్నట్టు వెల్లడించింది. దీనికోసం ఆఫ్ఘన్ సిటిజన్స్ రిసెటిల్ మెంట్ స్కీమ్ ప్రవేశపెట్టినట్టు తెలిపారు. అలాగే అక్కడి పౌరులు కూడా ఆఫ్ఘన్ వాసులని కూడా ఇంట్లోకి ఆహ్వానిస్తున్నారు.