రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయం ప్రపంచ దేశాలను భయం గుప్పిట్లోకి నెట్టింది. ఒకప్పటి రష్యా సోవియట్ యూనియన్ లో భాగం అయిన ఉక్రెయిన్ను స్వాధీనం చేసుకోవాలి అనే లక్ష్యంతో పుతిన్ ప్రకటించిన యుద్ధం ప్రపంచ వ్యాప్తంగా అల్లకల్లోలానికి దారి తీస్తోంది. మరో వైపు గత వారం రోజులుగా ఉక్రెయిన్-రష్యా మధ్య జరుగుతున్న యుద్ధంలో అనేక నగరాల్లోని వివిధ ప్రాంతాలు నేల మట్టం అయ్యాయి.
ఆ నగరాల్లో ప్రజలు ఉండాలంటేనే భయపడుతున్నారు. చాలా మంది ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బంకర్లలో తల దాచుకుంటున్నారు. ఎప్పుడు, ఎక్కడ ఎవరి మీద బాంబులు పడుతాయో అనేది తెలియక బిక్కుబిక్కుమంటూ ప్రాణభయంతో బతుకుతున్నారు.
ఇప్పటికే బంకర్లలో ఉండే చాలా మందికి కనీస అవసరాల తీరక చాలా ఇబ్బందులు పడుతున్నారు. తాగేందుకు నీళ్లు లేక, తినేందుకు తిండి లేక అల్లాడి పోతున్నారు. మరి కొందరు ఆరోగ్యం సహకరించని వారు అయితే కనీసం మందులు వేసుకునేందుకు కూడా లేకుండా ఇబ్బంది పడుతున్నారు. మరో వైపు చాలా మంది తమ ప్రాణాలను రక్షించుకునేందుకు దేశం వీడుతున్నారు. సరిహద్దు ప్రాంతాల్లోని చాలా మంది పక్కన ఉండే దేశాలకు వలస పోతున్నారు.
దేశంలో ఉంటే ఎప్పుడు ఏ క్షిపణి దాడిలో ప్రాణం పోతుందనే భయంతో సరిహద్దులను దాటుతున్నారు. దేశంలో ఉండి ప్రతీ క్షణం నరకం అనుభవించడం కన్నా.. బయట పడి హాయిగా బతకడంమేలని భావిస్తున్నారు. ఇలా అనుకుని సుమారు పది లక్షల మంది దేశాన్ని దాటారని లెక్కలు చెప్తున్నాయి.
తమ దేశంలో ఉంటే ప్రాణాలకు రక్షణ లేదని వారు అంటున్నారు. అందుకే తమ ఆస్తులను, వస్తువులను అన్నింటినీ వదిలేసి ప్రాణాలను రక్షించుకోవడం కోసం తరలిపోతున్నట్లు చెప్తున్నారు. ఇదిలా ఉండే ఉక్రెయిన్ సరిహద్దుల్లో ఉండే పోలాండ్ కు సుమారు ఐదు లక్షల మంది వలస పోయినట్లు సమాచారం. అంతేకాకుండా మరో సరిహద్దు దేశమైన హంగేరీకి లక్షా ఇరవై వేలకు పైగా ఉక్రెయిన్ వాసులు తరలిపోయారు. పోతున్నారు. వీరితో పాటు పక్కన ఉన్న మాల్టోవాకు సుమారు లక్ష మందికి పైగా పారిపోయినట్లు తెలుస్తుంది.
వీరంతా తమ ప్రాణాలను రక్షించుకోవాలని తపనతో కి.మీ. మేర నడక దారిన దేశం దాటుతున్నారు. మరికొందరు స్లొవేకియాకు పారిపోగా.. యురోపియన్ యూనియన్ దేశాలకు, బెలారస్ ఇలా వివిధ దేశాలు తరలి పోతున్నారు.