కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి ఏపీ సీఎం చంద్రబాబునాయుడిని పొగడ్తలతో ముంచెత్తారు. ప్రతిష్ఠాత్మకమైన పోలవరం ప్రాజెక్టుకు నాబార్డ్ మొదటి విడత రుణం విడుదల చేసే సంధర్భంగా ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి మాట్లాడుతూ ‘ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మా హీరో.. ఆయన పనిచేసినంత వేగంగా పనిచేయలేకపోతున్నామే అన్న బాధ కలుగుతుంది. ఆయనలా పనిచేయాలని మేమెప్పుడూ కోరుకుంటాం’’ అని పొగడ్తల్లో ముంచెత్తారు. తాను మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌కు, ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్రమోడీ గుజరాత్‌కు సీఎంలుగా ఉండేవారని, వారు ఎలా పని చేస్తున్నారో తెలుసుకుని తాను కూడా అలా పని చేయాలనుకునేదానినని ఉమాభారతి చెప్పారు. ఈ సందర్భంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లి, ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు ఒకరినొకరు ప్రశంసలతో ముంచెత్తారు.
కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడిని గొడుగుతో ఉమాభారతి పోల్చారు. ‘‘వెంకయ్యనాయుడు ఒక గొడుగు లాంటి వారు, మా పెద్దన్న, ఆయన పోలవరం కోసం ఎంతో ఆరాటపడుతున్నారు. మమ్మల్ని ఎంతో ప్రోత్సాహిస్తున్నారు.’’ అని ఆమె అన్నారు. చంద్రబాబు తనను పలుమార్లు ఏపీకి ఆహ్వానించారని, పోలవరం మూలంగానే ఏపీ, తెలంగాణాలకు వెళ్లలేకపోయానని ఆమె అన్నారు. ‘‘అక్కడికి వెళ్లగానే పోలవరం గురించి అడిగితే ఏం చెప్పాలనేది నన్ను వేధించేది. ఇప్పుడు రుణం విడుదల అయినందున చంద్రబాబు ఎప్పుడు పిలిస్తే అప్పుడు ఏపీకి వెళతా’’ అని మంత్రి అన్నారు. చంద్రబాబు ఎంత వేగంగా పని చేస్తున్నారో అంత వేగంగా తాము ఆయనతో సహకరించటం లేదనే బాధ తనకు ఉండేదన్నారు. కేంద్రమంత్రి సుజనా చౌదరి తరచు తన కార్యాలయానికి వచ్చి పోలవరం గురించి అడిగేవారని, తానెప్పుడు ఆర్థిఖ శాఖకు వెళ్లి రుణం గురించి మాట్లాడుతానా అని చూసేవారని ఆమె చెప్పారు. పోలవరంతో పాటు మొత్తం 99 నీటి పారుదల ప్రాజెక్టులకు రుణం ఇప్పించటంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ అత్యంత కీలకపాత్ర నిర్వహించారని ఉమాభారతి తెలిపారు. నదుల అనుసంధానం ప్రక్రియలో చంద్రబాబుకు ప్రముఖ పాత్ర కల్పిస్తామని ఆమె ప్రకటించారు. బాబు నదుల అనుసంధానంతోపాటు రాష్ట్రంలోని నదుల ఇంట్రాలింకింగ్ కూడా చేస్తున్నారని ఆమె ప్రశంసించారు.
మరోవైపు చంద్రబాబు ప్రధాని మోదీ, ఆర్థికశాఖ మంత్రి అరుణ్ జైట్లీ - వెంకయ్యనాయుడు - ఉమాభారతి తోపాటు తమ పార్టీకి చెందిన కేంద్రమంత్రి సుజనా చౌదరిని ప్రశంసలతో ముంచెత్తారు.సమావేశం అనంతరం చంద్రబాబునాయుడు కేక్ కట్ చేసి ఉమాభారతి - వెంకయ్యనాయుడుకు తినిపించి పోలవరం మొదటి విడత రుణం విడుదల సందర్భంగా అభినందనలు తెలిపారు. ఉమాభారతి ఆప్యాయంగా చంద్రబాబునాయుడును హత్తుకున్నారు. టీడీపీ తరఫున ముందే తెచ్చి పెట్టిన కేక్‌ను చంద్రబాబునాయుడు కట్ చేసి అందరికి తినిపించారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/