సంస్కారం లేని చైనా ... ఏం చేసిందంటే ?

Update: 2020-07-15 12:00 GMT
గత నెల 15 న గాల్వానా లోయ వద్ద భారత్ -చైనా మధ్య తీవ్రమైన ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడిన సంగతి తెలిసిందే. ఒకవైపు శాంతి చర్చలకు సిద్ధమంటూ చర్చలు జరుపుతూనే మరోవైపు భారత్ సైన్యం పై అడ్డగోలుగా విరుచుకుపడి 20 మంది భారత జవాన్లను పొట్టనపెట్టుకున్న. ఈ ఘటన తర్వాత చైనా -భారత్ మధ్య ఉన్న సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఆ తర్వాత చైనా పై ప్రతీకారంగా ఇండియా డిజిటల్ స్ట్రైక్ కి దిగి ..చైనాకి చెందిన 59 యాప్స్ ను ఇండియా లో నిషేధించింది. వాటిలో టిక్ టాక్ కూడా ఉండటం గమనార్హం. ఇక చైనా దాడిలో మరణించిన 20 మంది జవాన్లను భారత ప్రభుత్వం వీరులుగా అభివర్ణించి ..వారికీ సకల లాంఛనాలతో గౌరవ మర్యాదలతో అంత్యక్రియలు పూర్తీ చేసింది.

అయితే , అదే దాడిలో చనిపోయిన జవాన్ల పట్ల చైనా చాలా అమానుషంగా ప్రవర్తిస్తుంది. దేశం కోసం పోరాడి .. ప్రాణాలని అర్పించిన వీర సైనికులకు కనీసం గౌరవ మర్యాదలతో అంతిమ సంస్కారాలు కూడా నిర్వహించడం లేదు. ఆ దాడిలో ఎంతమంది మృతి చెందారో ఇప్పటికి కూడా చైనా ప్రకటించలేదు. దీనితో ఇప్పుడు అంతిమ సంస్కారాలకి అనుమతి ఇస్తే...ఆ విషయం ఎక్కడ బయటపడుతుందో అని వారి అంతిమ సంస్కారానికి కూడా అంగీకరించడం లేదని, కుటుంబ సభ్యులపై ఒత్తిడి పెంచుతోందని అమెరికా నిఘా వర్గాలు చెప్తున్నాయి. అలాగే , శోకసంద్రంలో ఉన్న సైనికుల కుటుంబాలను ప్రభుత్వం అవమానాల పాలు చేస్తోందని అమెరికా నిఘా వర్గాలంటున్నాయి. గాల్వానా లోయలో చనిపోయిన వీరజవాన్లకి పద్దతుల ప్రకారం అంతిమ సంస్కారాలు నిర్వహించకూడదు అని చైనా అధికారులు వారి కుటుంబాలకి ఆదేశాలు జారీచేశాయని అమెరికా నిఘా వర్గాలు చెప్తున్నాయి.
Tags:    

Similar News