పవన్ కళ్యాణ్ ని తెలివైన రాజకీయ నాయకుడిగా మాజీ ఎంపీ రాజకీయంగా విశేష అనుభవం ఉన్న ఉండవల్లి అరుణ్ కుమార్ గుర్తించారు. నిజానికి పవన్ కళ్యాణ్ ని ఇప్పటిదాకా అలా ఎవరూ కీర్తించినది లేదు పైగా ఆయనది అయోమయం రాజకీయమని, ఆయనకు ఏమీ తెలియదు అనుభవంలేదు అని విమర్శలు సంధించారు కూడా. అయితే పవన్ కళ్యాణ్ జనసేన పెట్టిన తొమ్మిదేళ్ల కాలంలో నిలకడ లేని రాజకీయమే చేశారు అని అనుకున్నా అది కూడా ఆయన రాజకీయ వ్యూహంలో భాగమే అని ఇపుడు భావించాల్సి వస్తోంది.
పవన్ కి వ్యూహాలు చాలానే ఉన్నాయని అవి ఆయన పక్కాగా అమలు చేస్తున్నారు అని భావించేవారూ ఉన్నారు. ఇపుడు పవన్ తెలివైన రాజకీయ నేత అంటూ ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పిన తరువాత పవన్ మార్క్ పాలిటిక్స్ ఏంటో ఏపీ చూసే రోజులు దగ్గరలోనే ఉన్నాయని అంటున్నారు. ఏపీలో చూస్తే పొత్తుల ఎత్తులు కొనసాగుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చీలకుండా చూస్తామని పవన్ కళ్యాణ్ స్పష్టంగా ప్రకటించారు.
ఇపుడు ఆ దిశగానే అడుగులు పడుతున్నాయి. మరో వైపు చూస్తే తెలుగుదేశంతో పొత్తు అంటే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కొన్ని సీట్లు మాత్రమే తీసుకుని ఒకటి రెండు మంత్రి పదవితో సంతృప్తి పడుతుంది అని అంతా అనుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ ఎంత పెద్ద తప్పు చేస్తున్నారో ఇలా అయితే జీవిత కాలంలో ఆయన సీఎం కాలేరని సానుభూతి చూపించే వారూ ఉన్నారు. కానీ నిజానికి పవన్ తెలివైన రాజకీయ జూదమే ఆడుతున్నారని అంటున్నారు.
దాన్ని ఉండవల్లి అరుణ్ కుమార్ చక్కగా కనిపెటారు. అదెలా అంటే తెలుగుదేశం అవసరాలే జనసేన అక్కర ముచ్చట తీరుస్తాయి అని ఉండవల్లి అంటున్నారు. పవన్ కళ్యాణ్ జనసేనతో పొత్తు పెట్టుకోకపోతే తెలుగుదేశం తుక్కు తుక్కు అవుతుందని ఉండవల్లి జోస్యం చెబుతున్నారు. జగన్ వచ్చే ఎన్నికల్లో మరోసారి గెలిస్తే తెలుగుదేశం పార్టీని అసలు బతకనివ్వరని భూస్థాపితం చేసి తీరుతారు అని ఉండవల్లి అంటున్నారు.
ఇప్పటికే తెలుగుదేశం మూలాలను పెద్ద ఎత్తున దెబ్బ తీస్తున్న జగన్ కే మరో చాన్స్ వస్తే ఏపీలో తెలుగుదేశం బతికి బట్ట కట్టడం కష్టమని అంటున్నారు. ఇక విడిగా పోటీ చేస్తే తెలుగుదేశానికి ఆ రకమైన పరిస్థితి అని తెలుగు కాబట్టే పొత్తుల కోసం చూస్తోందని ఆయన అన్నారు. ఇక జనసేనకు పొత్తు లేకపోతే కొత్తగా పోయేది ఏదీలేదని ఆయన అన్నారు. అందువల్ల జనసేన కచ్చితంగా సీఎం పోస్టు కోసమే పట్టుపడుతుందని, తమకు ముఖ్యమంత్రి పదవిలో వాటా ఇస్తేనే టీడీపీతో పొత్తు పెట్టుకుంటామని షాకింగ్ కండిషన్ పవన్ విధిస్తారు అని అంటున్నారు.
అంటే అపుడు తెలుగుదేశం పార్టీకి అది చాలెంజింగ్ పొత్తు అవుతుంది అని ఆయన అన్నరు. జనసేన తెలుగుదేశం పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు కంటే సీఎం పదవే కీలకమైన అంశం అవుతుందని ఒక చానల్ తో మాట్లాడుతూ ఉండవల్లి సంచలన కామెంత్శ్ చేశారు. తనకు సీఎం పదవి ఇస్తేనే పవన్ పొత్తు పెట్టుకుంటారు తప్ప వెనక్కి తగ్గేది ఉండబోదని ఉండవల్లి అంచనా కడుతున్నారు.
ఇలా కనుక చూసుకుంటే జనసేనతో పొత్తు కోసం చంద్రబాబు బాగా తగ్గాల్సి ఉంటుందని ఆయన అంటున్నారు. అలా కాకుండా ఒంటరి పోరుకు సిద్ధపడితే మాత్రం తెలుగుదేశం బలి అవుతుందని ఉండవల్లి తనదైన విశ్లేషణ వినిపిస్తున్నారు. మొత్తానికి ఉండవల్లి చెప్పేది ఏంటి అంటే జనసేనతో పొత్తు పెట్టుకోకుండా తెలుగుదేశం ఎన్నికలకు సింగిల్ గా వెళ్తే మాత్రం కచ్చితంగా చావు దెబ్బ తింటుందని. మరి ఈ విషయం రాజకీయంగా ఢక్కామెక్కీలు తిన్న చంద్రబాబుకు తెలియదా. పొత్తుల విషయంలో ఆయన ఆలోచనలు ఏంటో కూడా చూడాలి మరి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.