ప్యారిస్ ను ఇక.. ప్రశాతంగా ఉంచరంట

Update: 2015-11-14 14:44 GMT
ప్యారిస్ మీద జరిగిన ఉగ్రదాడిపై ఆ దేశ అధ్యక్షుడు సీరియస్ స్పందిస్తూ.. తమ దేశంపై ఐసిస్ యుద్ధానికి పాల్పడిందంటూ.. దానికి మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరిస్తున్న వేళ.. ఐసిస్ కూడా రియాక్ట్ అయ్యింది. ప్యారిస్ లో తాము పాల్పడిన ఉగ్రదాడి కారణంగా 140 మంది వరకు అమాయకులు మరణించి.. శోక సంద్రంలో ఉన్న వేళ ఐసిస్ మరో వార్నింగ్ ఇచ్చింది.

రానున్న రోజుల్లో ప్యారిస్ ఇక ఎంతమాత్రం ప్రశాంతంగా ఉండబోదంటూ ఇస్లామిక్ స్టేట్ సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. ప్యారిస్ మారణకాండకు కారణం తామేనని స్పష్టం చేసిన ఐసిస్.. రానున్న రోజుల్లో మరిన్ని దాడులకు పాల్పడతామని చెప్పింది. ఎక్కడ.. ఎప్పుడు తీశారో అర్థంకాని వీడియోతో తాజాగా బెదిరింపులకు పాల్పడిన ఐసిస్.. రానున్న రోజుల్లో మరిన్ని దాడులకు తాము తెగబడతామని చెప్పటం గమనార్హం.

ఐసిస్ తాజా హెచ్చరికల నేపథ్యంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఇక.. ప్యారిస్ మీద జరిగిన ఉగ్రదాడి.. ప్యారిస్ వాసులకు ఒక పీడకలగా మారింది. జరిగిన దాడికి తీవ్ర షాక్ లో ఉన్న వారికి.. తాజా వీడియో మరింత ఆందోళనకు గురి చేసేలా ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాక్షసుల్లాంటి ఐసిస్ తీవ్రవాదుల అంతు చూడాల్సిన సమయం ఆసన్నమైందని. ప్రపంచ దేశాలన్నీ కలిసికట్టుగా ఏదో ఒక నిర్ణయం తీసుకోకుంటే.. ఇలాంటి మారణకాండలు మరిన్ని చోటు చేసుకోవటం ఖాయమన్న మాట వినిపిస్తోంది.
Tags:    

Similar News