ఐఎస్ రాక్షసుల కంటే నికృష్టులా ఫ్రాన్స్ సైనికులు?

Update: 2016-04-02 04:41 GMT
మానవత్వం అనేది ఇసుమంత కూడా లేకుండా దారుణంగా వ్యవహరించే ఐఎస్ తీవ్రవాదులపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతాయి. సాటి మనిషి అన్న కనీస స్పృహ లేకుండా వారు చేసే చేష్టలపై ప్రపంచ వ్యాప్తంగా నిరసన వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. పురాణాల్లో ప్రస్తావించే రాక్షసులకు మించిన రాక్షసత్వంతో వ్యవహరించే ఐఎస్ తీవ్రవాదుల దుశ్చర్యలు అన్నిఇన్ని కావు. మహిళల విషయంలో వారెంత దారుణంగా వ్యవహరిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

కానీ.. తాజాగా బయటకు వచ్చిన ఉదంతం చూస్తే విస్మయానికి గురి కావటమే కాదు.. ఐఎస్ రాక్షసుల కంటే అత్యంత క్రూరమైన వైఖరిని ఐక్యరాజ్యసమితి శాంతి సేనలోని కొందరు సైనికులు పాల్పడిన ఉదంతం బయటకు వచ్చింది. షాకింగ్ గా ఉండటమే కాదు.. అత్యంత జుగుస్సాకరంగా ఉన్న ఈ సైనికుల వ్యవహారశైలికి సంబంధించిన విషయాలు తాజాగా బయటకు వచ్చాయి.

ఈ సమాచారం బయటకు వచ్చిన వెంటనే ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అత్యవసర అంతరంగిక సమావేశాన్ని నిర్వహించిందంటే పరిస్థితి తీవ్రతను ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఫ్రాన్స్ కు చెందిన సాంగరిస్ ఇంటర్ వెన్షన్ ఫోర్స్ తో పాటు పలు దేశాలకు చెందిన సైనికులు సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ లో విధులు నిర్వహిస్తున్నారు. శాంతిసేన పేరుతో విధులు నిర్వర్తిస్తున్న వారి ఆకృత్యాలు మాటల్లో చెప్పలేనంత దారుణంగా ఉన్నాయి. శాంతిసేనలోని ఫ్రాన్స్ సైనికుల దుశ్చర్యల విషయానికి వస్తే.. ఆ దేశ సైనికులు పెద్ద ఎత్తున అత్యాచారాలకు పాల్పడినట్లుగా ఆరోపిస్తున్నారు.

అన్నింటికంటే ఘోరమైన విషయం ఏమిటంటే.. మైనర్ బాలికల్ని జంతువుల చేత అత్యాచారాలు చేయించేవారని.. తాజాగా నలుగురు చిన్నారులపై కుక్కతో లైంగిక దాడి చేయించిన విషయాన్న అమెరికాకు చెందిన పౌర సేవా సంస్థ ఎయిడ్స్ ఫ్రీ వరల్డ్ పేర్కొంది. ఈ చర్య వెలుగు చూసిన తర్వాత ఆ మైనర్ బాలికలకు నష్టపరిహారం అందించినట్లుగా వెల్లడించారు.

అయితే.. బాధిత చిన్నారుల్లో ఒకరు గుర్తు తెలియని వ్యాధితో మరణిస్తే.. మరో ముగ్గురు బాధితులు ఫ్రాన్స్ సైనిక బృందం చేసిన దారుణాల్ని వెల్లడించటంతో ఈ విషయాలు బయటకు వచ్చాయి. తాజా ఆరోపణలపై ఫ్రాన్స్ రాయబారి ఫ్రాంకోయిస్ డెలాట్రే రియాక్ట్ అవుతూ.. ఈ ఘటన అత్యంత క్రూరమైనదిగా పేర్కొంటూ.. సైనికుల మీద వచ్చిన ఆరోపణలు నిరూపితమైతే.. వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. నాగరిక ప్రపంచంగా తమను తాము  చెప్పుకునే ప్రాశ్చాత్య దేశాలు శాంతి పరిరక్షక దళంగా చెబుతూ.. ఇంత అనాగరికంగా.. రాక్షసంగా వ్యవహరించటాన్ని ఏమనాలి?
Tags:    

Similar News