రాజధాని వ్యవహారం లో చంద్రబాబు కు ఊహించని షాక్

Update: 2019-12-26 09:39 GMT
విశాఖపట్నం ను పరిపాలన రాజధానిగా ప్రకటించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ అమరావతి రైతుల కు మద్దతు గా రాజకీయంగా చేస్తున్న చంద్రబాబు కు దిమ్మదిరిగే షాక్ తగిలింది. ఇప్పటికే ఉత్తరాంధ్ర నేతలు విశాఖ పరిపాలన రాజధానికి సపోర్టు చేసి బాబుకు ఝలక్ ఇచ్చారు.

తాజాగా విశాఖ టీడీపీ అర్బన్ అధ్యక్షుడు రెహమాన్ చంద్రబాబు కు షాక్ ఇచ్చారు.. విశాఖను రాజధాని గా టీడీపీ వ్యతిరేకిస్తున్నందుకు నిరసన గా తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు రెహమాన్ ప్రకటించి సంచలన సృష్టించారు.

విశాఖలో టీడీపీ కి రాజీనామా చేసి మాట్లాడిన రెహమాన్... చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు ముందు రాజధాని ప్రజలకు, అక్కడి రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అధికారం ఇచ్చినా గత ఐదేళ్లలో అమరావతిలో ఎలాంటి నిర్మాణం చేయలేకపోవడం చంద్రబాబు వైఫల్యమని రెహమాన్ దుయ్యబట్టారు.

విశాఖను రాజధానిగా ఈ ప్రాంతవాసులు స్వాగతిస్తే తప్పు ఎలా అవుతుందని.. వ్యతిరేకిస్తున్న వారు చరిత్రహీనులవుతారని రెహమాన్ మండిపడ్డారు. తాను చరిత్ర హీనుడి గా మిగిలిపోదలుచుకో లేదని.. అందుకే చంద్రబాబు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు.


Tags:    

Similar News