ఇక అత్యంత కీలకమైన హామీ ప్రత్యేక హోదా. స్పెషల్ స్టేటస్ పై బడ్జెట్ లో మాటమాత్రం కూడా ప్రస్తావించకపోవడం పలు వర్గాలకు ఆశ్చర్యకరంగానే కాదు విస్మయంగాను ఉంది. ప్రత్యేక హోదా కట్టబెట్టడంలో జాప్యం ఎదురవుతున్నందున పారిశ్రామికంగా ఆశించిన వృద్ధి జరగలేదు. ప్రోత్సాహకాలు ఆశించినంతగా రాకపోవడం వల్ల ఆంధ్రప్రదేశ్ కు పెట్టుబడులు రాలేదు. ఈ నేపథ్యంలో ఉత్తరాఖండ్ - హిమచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు ఇచ్చే పారిశ్రామిక ప్రోత్సకాలు ఆంధ్రప్రదేశ్ కు కూడా ఇవ్వాలని చంద్రబాబు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకమైన స్థానం కల్పించి, ఏపీ సహాయం అని ''ప్రత్యేక బడ్జెట్ లైన్'' ఏర్పాటు చేయాలని కోరారు. అయితే వీటి ఊసుకూడా బడ్జెట్ లో ఎత్తలేదు.
ఇక ఏడు వెనుకబడిన జిల్లాలకు రావాల్సి నిధుల ప్రస్తావన కూడా బడ్జెట్ లో లేదు. ఇప్పటివరకు జిల్లాకు 50 కోట్ల చొప్పున రెండు దశలుగా 700 కోట్లు ఇచ్చారు. అయితే ఆ జిల్లాల్లో అభివృద్ధిని వేగవంతం చేసేందుకు జిల్లాకు రెండు వందల కోట్లు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. అయితే కొండనాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిందన్న సామెతలా... అదనపు నిధుల సంగతి అలా ఉంచితే... అసలు నిధులను కూడా కేంద్రం ఆపేసింది. ఇక స్పెషల్ స్టేటస్ ను తలదన్నేలా వస్తుందని ఊరించిన ప్రత్యేక ప్యాకేజీ - దుగ్గిరాజపట్నం పోర్టు వంటి వాటిని కేంద్రం పట్టించుకోలేదు.
ఇంతకీ బడ్జెట్ లో ఏపీకి ఏం ప్రయోజనం చేయలేదా? అంటే చేశారు. అది బొటాబొటిగా మాత్రమే అనేది అసలు విషయం. కేంద్రం ఈ బడ్జెట్ లో పారిశ్రామిక సబ్సిడీ కింద వంద కోట్లు కేటాయించింది. అలాగే విజయవాడ మెట్రోరైల్ కు వంద కోట్లు - విశాఖ స్టీల్ ప్లాంట్ విస్తరణకు 1678 కోట్లు - విశాఖ పోర్టు ట్రస్ట్ కు 231.61 కోట్లు కేటాయించింది. అలాగే ఐఐటికి 40 కోట్లు - ఐఐఎంకు 30 కోట్లు - నిట్ కు 40 కోట్లు - ఐఐఎస్ ఇఆర్ కు 40 కోట్లు - త్రిపుల్ ఐటికి 20 కోట్లు కేటాయించిన కేంద్రం ఇతర చిన్న చిన్న రంగాలకు మరో వంద కోట్ల వరకు కేటాయించింది.
మొత్తంగా ఆంధ్రప్రదేశ్ కు ఇవి కావాలంటూ బాబు అందజేసిన లిస్ట్ బారెడు ఉంటే...గొర్ర తోక బెత్తెడు అన్న చందంగా కేంద్రం కేటాయింపులు ఉన్నాయనేది సుస్పష్టం. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏపీ విభజన గురించి పెద్ద పెద్ద మాటలు చెప్పిన ప్రధానమంత్రి ఆచరణలో వాటిని "లైట్" తీసుకొని నికార్సైన రాజకీయ నాయకుడని పించుకున్నారు. అయితే తన ఆశను వదులుకోని టీడీపీ అధ్యక్షుడు - ఏపీ సీఎం చంద్రబాబు మాత్రం ఎక్కే విమానం, దిగే విమానం అంటూ ప్రత్యేక ఫ్లైట్లతో ఢిల్లీ చక్కర్లు కొట్టారు. వినతిపత్రాలు ఇచ్చి సదరు కేంద్ర మంత్రుల సానుకూల మాటలతో సంతోషపడ్డారు. చంద్రబాబు ప్రయత్న లోపం లేకుండా ఆ టూర్లు పెట్టుకున్నారనేది నిజమే అయినప్పటికీ కేంద్రం నుంచి సానుకూలంగా నిర్ణయాలు వెలువడటంలో ఎందుకు ఫెయిల్ అయ్యారనేది కూడా ఆలోచించాల్సిన విషయమే. కేంద్రం తన చర్యలను విశ్లేషించుకొని ఏపీకి న్యాయం చేసే విధంగా అడుగులు వేసే క్రమంలో గట్టి అడుగులు పడాల్సిందే. లేదంటే ఏపీకి దక్కింది మట్టి, నీరే... అనే సెటైర్ ఆచరణలో నిజమయ్యే అవకాశం ఉంది.