బ‌డ్జెట్ హైలెట్స్ః అన్న‌దాత‌ల‌కు అండ

Update: 2016-02-29 06:46 GMT
కేంద్ర బడ్జెట్లో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్న‌దాత‌ల‌కు అండ‌గా నిలిచారు. ప‌ల్లెసీమ‌ల‌కు ప‌ట్టుగొమ్మ‌లుగా గుర్తించి గ్రామీణ రంగం - వ్యవసాయ రంగానికి ఆర్థిక దన్నుగా ఉంటామని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్ర‌క‌టించారు. వచ్చే ఏడాదికి 9 సూత్రాల ఆధారంగా అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆర్గానిక్ వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటామ‌ని చెప్పారు. వ్యవసాయ రంగానికి బ‌డ్జెట్లో రూ. 35,985 కోట్లు కేటాయించామ‌ని ప్ర‌క‌టించారు. 2020 నాటికి వ్యవసాయ ఆధారిత ఆదాయం రెట్టింపు చేయడమే త‌మ‌ లక్ష్యమని ఉద్ఘాటించారు. ప్రభుత్వ బ్యాంకులను బలోపేతం చేస్తామని తెలిపారు.

ఉపాధి హామీ పథకానికి రూ. 38,500 కోట్లు కేటాయించినట్లు జైట్లీ వెల్లడించారు. ఉపాధి హామీ పథకానికి గత ఏడాది కంటే దాదాపు రూ. 4 వేల కోట్లు అదనంగా కేటాయించామని చెప్పారు. భూగర్భ జలాల పెంపునకు రూ. 60 వేల కోట్లు, గ్రామీణాభివృద్ధికి రూ. 87,765 కోట్లు. పశు పోషణకు కొత్తగా 4 పథకాలు అమలు చేస్తామని ప్ర‌క‌టించారు. పశు వైద్య పరీక్షల కార్డులు, పాల సేకరణకు ప్రోత్సహం, ఈ-మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తామన్నారు. 300 రూర్బన్ క్లస్టర్ల ఏర్పాటు చేస్తామన్నారు. గ్రామీణ విద్యుదీకరణకు పటిష్టమైన చర్యలు తీసుకుంటామని జైట్లీ స్పష్టం చేశారు.

ప్రధాని సించాయి యోజన ద్వారా అదనంగా 25 లక్షల ఎకరాలకు సాగునీరందిస్తామని జైట్లీ అన్నారు. వచ్చే ఐదేళ్లలో సాగునీటి కోసం రూ. 86,500 కోట్లు వ్యయం చేస్తామని స‌భ‌లో జైట్లీ ప్ర‌క‌టించారు. రైతుల కోసం ఏప్రిల్ 14 నుంచి ఈ- మార్కెటింగ్ సదుపాయం కల్పిస్తామన్నారు. రైతులు, ప్ర‌జ‌ల‌కు ఆహార భ‌రోసా ఇచ్చేందుకు గాను పప్పు ధాన్యాల అభివృద్ధికి రూ. 500 కోట్లు ఖర్చు చేస్తామన్నారు.
Tags:    

Similar News