బ్రేకింగ్: కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు కరోనా

Update: 2020-08-02 11:34 GMT
దేశంలో కరోనా కల్లోలం చోటుచేసుకుంటోంది. ఏకంగా దేశంలోని అత్యున్నత స్థాయి వ్యక్తులకు కూడా పాకుతుండడం కలవరపెడుతోంది.

తాజాగా దేశంలోనే ప్రధాని మోడీ తర్వాత నంబర్ 2.. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు కూడా కరోనా వైరస్ సోకింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ లో వెల్లడించారు. ఈ మేరకు తనకు కరోనా వచ్చిందని.. ఆస్పత్రిలో చికిత్స కోసం చేరానని ట్వీట్ చేశారు

‘కరోనా వైరస్ లక్షణాలు కనిపించడంతో నేను టెస్టులు చేయించుకున్నాను. అందులో రిపోర్ట్ పాజిటివ్ గా వచ్చింది. నా ఆరోగ్యం బాగానే ఉంది. కానీ వైద్యుల సలహా మేరకు ఆస్పత్రిలో చేరుతున్నా. కొన్ని రోజులుగా నాతో కలిసిన వారు మీరు కూడా టెస్టులు చేయించుకోండి’ అని అమిత్ షా ట్వీట్ చేశారు.

ఇక ఇటీవల తనను కలిసిన వారంతా కరోనా టెస్టులు చేసుకోవాలని.. అందరూ హోం ఐసోలేషన్ లో ఉండాలని అమిత్ షా కోరారు.
Tags:    

Similar News