అన్నీ రాష్ట్ర ప్ర‌భుత్వాలు చేస్తే... మ‌రి న‌రేంద్ర మోడీకి పీఎం పోస్ట్ ఎందుకు?

Update: 2022-05-15 06:29 GMT
అన్నీ రాష్ట్ర ప్ర‌భుత్వాలే చేసుకోవాలి.. అన్నీ రాష్ట్ర ప్ర‌భుత్వాలే కొనుగోలు చేయాలి. మేం మాత్రం ప‌క్క‌న ఉండి.. చూస్తూ ఉంటాం. ఇదీ.. కేంద్రంలోని న‌రేంద్ర మోడీ స‌ర్కారు కాన్సెప్ట్‌. అయితే.. ఇక్క‌డ ఉన్న మ‌రో చిన్న లాజిక్కు ఏంటంటే.. రాష్ట్రాల‌కు కేంద్రంలోని న‌రేంద్ర మోడీ స‌ర్కారు ఏమీ చేయ‌క‌పోయిన‌ప్ప‌టి.. రాష్ట్రాల్లోని ప్ర‌జ‌లు మాత్రం బీజేపీకి ఓట్లు వేసేయాలి.  ఇదీ..కాన్సెప్టు. మ‌రి ప్ర‌జ‌లు ఏమ‌న్నా.. పిచ్చి పుల్లాయ్‌లు అనుకుంటున్నారో.. ఏమో.. తెలియ‌దుకానీ.. బీజేపీ నేత‌ల మాట‌లు మాత్రం ఇలానే ఉన్నాయి.

ఉదాహ‌ర‌ణ‌కు తెలంగాణ‌లో ధాన్యం సమ‌స్య వ‌చ్చింది. దీనిని కొనుగోలు చేయాల‌ని.. రాష్ట్ర ప్ర‌భుత్వం మొర పెట్టుకుంది. ఏకంగా ఢిల్లీలో స‌మ‌రానికి కూడా స‌ర్కారు సిద్ధ‌మైంది. అయిన‌ప్పటికీ.. కేంద్రం స‌సే మిరా అంది. తీసుకునేది లేద‌ని చెప్పింది.  అయితే..రాష్ట్ర ప్ర‌భుత్వం మాత్రం వ‌న్ నేష‌న్‌.. వ‌న్ రేష‌న్ మాదిరి గానే వ‌న్ ప్రొక్యూర్ మెంట్ విధానం అమ‌లు చేయాల‌ని డిమాండ్ చేసింది. అయిన‌ప్ప‌టికీ.. కేం ద్రం క‌రుణించ లేదు. తాజాగా.. రాష్ట్రానికి వ‌చ్చిన నెంబ‌ర్ 2 నాయ‌కుడు.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఏకంగా.. సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు..

రాష్ట్రంలో ధాన్యాన్ని రాష్ట్ర ప్ర‌భుత్వ‌మే కొనుగోలు చేయాల‌ని.. బాయిల్డ్‌రైస్‌ను కొనుగోలు చేసేందుకు కేంద్రం సిద్ధంగా లేద‌ని.. చెప్పుకొచ్చారు. ఇక, ప్ర‌కృతి విప‌త్తులు.. ప్రాజెక్టుల నిర్మాణం.. ఇలా అనేక విష‌యాల్లోనూ.. కేంద్రం తన పాత్ర‌ను ప‌రిమితం చేసుకుని, బాధ్య‌త మొత్తాన్నీ.. రాష్ట్రాల‌పై నెట్టేసిన ప‌రిస్థితి క‌నిపిస్తోంది. దీంతో ఆయా రాష్ట్రాలు ఆర్థికంగా.. ఇబ్బందులు ప‌డుతున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది. అయినా.. కూడా కేంద్రం ఏమాత్ర‌మూ ప‌ట్టించుకుంటున్న ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు.

అయితే.. ఇక్క‌డ మ‌రో చిత్రం ఏంటంటే.. రాష్ట్రాల‌కు ఏమీ చేయ‌ని.. రాష్ట్రాల బాధ‌లు రాష్ట్రాలే ప‌డాల‌ని చెబుతున్న కేంద్రం.. ఆయా రాష్ట్రాల్లో ప్ర‌జ‌లు మాత్రం బీజేపీకి ఓట్లు వేయాల‌ని.. త‌మ‌ను గెలిపించాల‌ని కోరుతుండ‌డం గ‌మ‌నార్హం.  నిజానికి ప‌నిచేసిన వాడికే కూలిడ‌బ్బులు ద‌క్కించుకునే హ‌క్కు.. అడిగే రైటు ఉంటుంది. కానీ.. ఇక్క‌డ బీజేపీ మాత్రం మీ చావు మీరు చావ‌డం.. ఓట్లు మాత్రం మాకే వేయండి.. అనే ఫార్ములాను అనుస‌రిస్తుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఇదేం న్యాయ‌మో.. ఇదేం ప‌ద్ద‌తో.. విశ్వ‌గురువుగా భాసి ల్లుతున్న మోడీ నేతృత్వంలోని బీజేపీ పార్టీనే చెప్పాల‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. 
Tags:    

Similar News