తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పై కీలక వ్యాఖ్యలు చేశారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. ఎప్పుడూ వ్యవహరించని తీరును గులాబీ బాస్ ప్రదర్శిస్తున్నారని.. అదంతాఎందుకో చెప్పేశారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఈటల రాజేందర్ విజయం.. కేసీఆర్ లో ‘మంట’ను పెంచిందన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ ఎప్పుడూ.. ఎక్కడా బయటకురాని కేసీఆర్.. ధర్నా చౌక్ లో ధర్నాకు రావటం.. బీజేపీపై పరుష పదజాలంతో విరుచుకుపడటం అందుకేనని చెప్పారు. అంతేకాదు.. తన మీద చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలకు స్పందించారు.
తనకు వ్యవసాయం అంటే ఏమిటో తెలీదని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారని.. అవన్నీ తప్పు అని చెప్పారు. నాగలితో రెండు గంటల దున్నేందుకు తాను సిద్ధమని.. ముఖ్యమంత్రి సిద్ధమా? అని సవాలు విసిరారు. ఈ మధ్యన నిర్వహించిన మీడియా సమావేశంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డిపై ఘాటుగా రియాక్టు అయిన కేసీఆర్.. ఆయనకు వ్యవసాయం తెలీదన్నారు. మరి.. తాజాగా ఆయన సవాలు మీద స్పందించిన కిషన్ రెడ్డి మాటకు సీఎం ఏ రీతిలో రియాక్టు అవుతారో చూడాలి.
హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితం ఆయనలో మంటను పెంచిందన్నారు. సీఎంగా బాధ్యతాయుతమైన పదవిలో ఉండి కూడా హింస.. ఘర్షణలు చెలరేగేలా రెచ్చగొట్టటం కేసీఆర్ కు ఎంతవరకు సమంజసం? అని ప్రశ్నించారు. హింసను ప్రేరేపించేలా సీఎం కేసీఆర్ వ్యాఖ్యలు ఉన్నాయన్నారు. ‘బీజేపీ నేతల్ని ఉరికించండి.. కేంద్రంపై యుద్ధం చేస్తాం. ఢిల్లీలో అగ్గి పెడతాం. బీజేపీ శవయాత్రలు చేయాలి. కేంద్రం దిష్టిబొమ్మలను దహనం చేయాలి’ లాంటి మాటల్ని ఒక ముఖ్యమంత్రి చెప్పటం తాను ఎక్కడా చూడలేదన్నారు.
ధాన్యం కొనుగోళ్ల మీద అబద్ధపు ప్రచారం చేస్తున్నారని.. రైతుల్ని తప్పుదారి పట్టిస్తున్నారని మండిపడ్డారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి నోటి నుంచి కీలక వ్యాఖ్యలు వచ్చాయి. ఈ సీజన్ లో ఉప్పుడు బియ్యాన్ని కొంటున్నామని.. వందశాతం కొంటామని.. రబీ సీజన్ కు కేంద్రం ఏ రాష్ట్రానికి లక్ష్యాన్ని కేటాయించలేదన్నారు. పంట మార్పిడి విషయంలో అటు కేందంతో పాటు బీజేపీ కూడా సహకరిస్తుందని.. రైతుల్ని భయపెట్టొద్దన్నారు. ఎప్పటిలానే 2023లో తమ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. మరి.. కిషన్ రెడ్డి విసిరిన దున్నుడు సవాలుకు సీఎం కేసీఆర్ ఏ మేరకు రియాక్టు అవుతారో చూడాలి.