కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషికి కరోనా..తిరుమలలో టెన్షన్

Update: 2020-10-08 04:45 GMT
దేశంలో కరోనా కోరలు చాస్తూనే ఉంది. కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఇప్పటికే కేంద్ర హోంమంత్రి నుంచి రాష్ట్రాల మంత్రులు, ఎమ్మెల్యేల వరకు భారీగా సోకింది. సామాన్యులు, ప్రజాప్రతినిధులు, అధికారులు బయటకొస్తే చాలు కరోనా బారినపడుతున్నారు. అనేకమందికి ఇప్పటికే సోకింది.

తాజాగా మరో కేంద్రమంత్రికి కరోనా సోకింది. కేంద్ర పార్లమెంట్ కేంద్ర పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషికి కరోనా సోకింది.  ఈ విషయాన్ని కేంద్ర మంత్రి తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియజేశారు.  ఎలాంటి లక్షణాలు లేకున్నా కరోనా నిర్ధారణా పరీక్షల్లో కరోనా పాజిటివ్ గా నిర్ధారణ జరగడంతో అయన హోమ్ క్వారంటైన్ లో ఉన్నట్టుగా ట్విట్టర్ ద్వారా తెలిపారు.  

సోమవారం రోజున ప్రహ్లాద్ జోషి తిరుమల వెళ్లి శ్రీవారిని దర్శించుకున్నారు. సుందరకాండ పఠనంలో కూడా కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి పాల్గొన్నారు. దీంతో జోషి పర్యటనలో పాల్గొన్న అధికారులు అందరిలో భయాందోళనలు నెలకొన్నాయి.

అయితే తిరుమల పర్యటనలో ఆయనకు కరోనా సోకిందా? లేక కరోనాను వెంటబెట్టుకొని తిరుమలకు వచ్చారా అన్నది తెలియాల్సి ఉంది. దీంతో తిరుమలలో ఆయనతోపాటు పర్యటించిన అధికారులు, అర్చకులు నేతల్లో టెన్షన్ నెలకొంది.
Tags:    

Similar News