ఇండియ‌న్ టికెట్ ర‌ద్దు చేసిన విమాన‌ సంస్థ‌

Update: 2017-05-12 06:45 GMT
ఇటీవ‌లి కాలంలో తీవ్ర వివాదాస్ప‌దంగా మారిన అమెరికాకు చెందిన యునైటెడ్ ఎయిర్‌ లైన్స్ మ‌రోమారు అదేరీతిలో మ‌ళ్లీ వార్త‌ల్లోకి ఎక్కింది. లగేజీ చార్జీలపై వాగ్వాదంలో యునైటెడ్ ఎయిర్‌ లైన్స్‌ కు చెందిన ఉద్యోగిని ప్రవర్తనను చిత్రీకరించినందుకు ఒక ప్రయాణికుని విమాన టికెట్ రిజర్వేషన్ రద్దయ్యింది. భారత సంతతికి చెందిన నవాజ్ ఓజా(37) న్యూ ఓర్లీన్స్ నుంచి శాన్‌ ఫ్రాన్సిస్కో వెళ్లేందుకు టికెట్ రిజర్వేషన్ చేసుకున్నాడు. న్యూ ఓర్లీన్స్ విమానాశ్రయంలో ఓజాకు చెందిన లగేజీకి 300 డాలర్ల చార్జీ వేశారు. ఇంతకుముందు ఇదే బ్యాగ్‌ కు 125 డాలర్లు మాత్రమే చెల్లించానని ఓజా వాదించాడు. ఎయిర్‌ లైన్స్ సిబ్బంది నుంచి ఎటువంటి సమాధానం రాకపోవడంతో తనలాంటి బాధితులను కూడగట్టే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో వివాదం మొత్తాన్ని తన సెల్‌ ఫోన్‌ లో చిత్రీకరించాడు. దీన్ని గమనించిన యునైటెడ్ ఎయిర్‌ లైన్స్ ఉద్యోగిని ఓజా రిజర్వేషన్‌ ను రద్దు చేయాలని అక్కడున్న ఏజెంట్‌ ను ఆదేశించింది.

ఉద్యోగి నుంచి ఆదేశాలు రావ‌డంతో ఓజా టికెట్ ర‌ద్దు చేశారు. దీంతో ఎయిర్‌ లైన్స్ విమానంలో వెళ్లిపోయాడు. తరువాత ఆ వీడియోను ట్విట్టర్‌ లో పోస్ట్ చేశాడు. క్షమాపణలు చెప్తూ ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్టు ఆ ఎయిర్‌ లైన్స్ పేర్కొంది. ఇప్పటికే కొందరు ప్రయాణికులను విమానం నుంచి గెంటివేసి అప్రతిష్ఠపాలైన ఈ ఎయిర్‌ లైన్స్‌ కు ఈ వివాదం మరో తలనొప్పిగా మారింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News