వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తోంది అమెరికా విమానయాన సంస్థ యునైటెడ్ ఎయిర్ లైన్స్. ఆ మధ్యన లెగింగ్స్ వేసుకున్నారంటూ విమాన ప్రయాణానికి అనుమతించకుండా వార్తల్లోకి వచ్చిన ఈ విమానయాన సంస్థ.. ఈ మధ్యనే ఒక డాక్టర్‌ను సిబ్బంది చేత రక్తం వచ్చేలా ఈడ్చి పారేసిన వైనం ప్రపంచ వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తి.. యునైటెడ్ ఎయిర్ లైన్స్ పరువు మొత్తం పోయింది.
ఈ ఉదంతం నేపథ్యంలో నిబంధనల్లో మార్పులు చేసినట్లు కవర్ చేసినా.. తన మూలాలు ఏమీ మారలేదని తాజాగా మరోసారి నిరూపించుకున్నారు ఆ ఎయిర్ లైన్స్ సిబ్బంది. ఎంగేజ్ మెంట్ పూర్తి అయి త్వరలో వివాహం చేసుకోనున్న ఓ జంటను విమానం నుంచి దించేసిన వైనం ఇప్పుడు విమర్శలు వెల్లువెత్తేలా చేస్తోంది.
హ్యూస్టన్ నుంచి టెక్సాస్‌కు మైఖెల్ హాల్.. అంబర్ మ్యాక్స్ వెల్ అనే ఇద్దరు ప్రేమికులు యునైటెడ్ ఎయిర్ లైన్స్ విమానంలో బయలుదేరారు. అయితే.. వారికి కేటాయించిన సీట్లలో కాకుండా వేరే సీట్లలో కూర్చున్నారని.. వారి ప్రవర్తన బాగోలేదని చెబుతూ వారిని బలవంతంగా విమానం నుంచి దించేశారు. అయితే.. బాధితుల వెర్షన్ మాత్రం వేరుగా ఉంది.
తాము రూల్స్ ను బ్రేక్ చేయలేదని.. తమ సీట్లో ఓ వ్యక్తి అడ్డదిడ్డంగా కూర్చోవటంతో.. సిబ్బందిని వేరే సీట్లు కేటాయించాలని అడిగినట్లు చెబుతున్నారు. అందుకు సిబ్బంది ఒప్పుకోకపోవటంతో.. వెనుక రెండు సీట్లు మిగిలితే అక్కడికి వెళ్లి కూర్చున్నామని.. విమానంలోని ఓ ఫెడరల్ అధికారి ఉండటంతో ఆయనకు జరిగిందంతా చెప్పి.. తమ టికెట్లను అప్ గ్రేడ్ చేసి ఫస్ట్ క్లాస్ టికెట్లు ఇవ్వాలని కోరామని.. కానీ.. తమ ఇద్దరినీ విమానం నుంచి దించేసినట్లుగా లవ్వర్స్ వాపోతున్నారు.
ఎయిర్ లైన్స్ సిబ్బంది కారణంగా తర్వాతి రోజుకి తాము టికెట్ బుక్ చేసుకోవాలని చెబుతుంటే.. యునైటెడ్ ఎయిర్ లైన్స్ మాత్రం.. వారికి రాత్రి పూట ప్రత్యేకంగా బస ఏర్పాటు చేసి పక్కరోజు ఉదయం టికెట్లు ఇచ్చినట్లుగా పేర్కొన్నారు. వరుస వివాదాలతో ఇరుక్కుంటున్న యునైటెడ్ ఎయిర్ లైన్స్ తాజా ఇష్యూలో ఎంతలా విమర్శల్లోకి కూరుకుపోతుందో చూడాలి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/