యూపీ సీఎం యోగినా మజాకా.. బీజేపీ నేత ఇంటిపైనే బుల్డోజర్ దాడి

Update: 2022-08-08 11:41 GMT
యూపీలో అల్లకల్లోలం సృష్టించి రౌడీలు, గుండాల గుండెల్లో నిద్రపోతున్నాడు యూపీ సీఎం యోగి ఆధిత్యనాథ్. వారి అక్రమాస్తులను బుల్డోజర్లతో కూల్చివేయిస్తున్నాడు. అరాచకాలు సృష్టించే వారి ఆస్తులను కూకటివేళ్లతో పెకిలిస్తూ క్రైం చేయడానికి భయపడేలా చేస్తున్నాడు. యోగి ప్రవేశపెట్టిన ఈ 'బుల్డోజర్ యాక్షన్' అనగానే ఇప్పుడు యూపీలో అందరికీ తడిసిపోతోంది. ఎవ్వరూ తప్పు చేసిన ఆ ఇంటి ముందు వెంటనే బుల్డోజర్ దిగిపోతుంది. అక్రమ కట్టడాలు ఏమైనా ఉంటే కూల్చివేస్తుంది.

పూర్తిగా బుల్డోజర్లతో అరాచకవాదుల ఇళ్లు కూల్చిన ఘటనలు ఎన్నో యూపీలో ఉన్నాయి. అయితే ఎక్కువగా ముస్లిం అతివాదులవే కూలుస్తున్నారన్న అపవాదు యోగి సర్కార్ పై ఉండేది. కానీ తాజాగా ఏకంగా అధికార బీజేపీ నేతపైనే బుల్డోజర్ చర్యకు దిగడం దేశవ్యాప్తంగా సంచలనమైంది.

నోయిడా హౌజింగ్సొసైటీలో ఓ మహిళపై స్థానిక బీజేపీ నేత అనుచితంగా ప్రవర్తించాడు. ఆమెను దూషించి దాడి చేసినట్లు ఆరోపణలున్నాయి. ఆ మహిళపట్ల, బీజేపీ నేత శ్రీకాంత్ త్యాగి వ్యవహరించిన తీరుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో సీరియస్ అయిన యోగి.. సదురు బీజేపీ నేత శ్రీకాంత్ త్యాగి ఇంటిని కూల్చివేయడం సంచలనంగా మారింది.

నోయిడా హౌజింగ్ సొసైటీకి బుల్డోజర్ రావడంపై స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు. చప్పట్లు కొట్టి సీఎం యోగి తీరుపై ప్రశంసలు కురిపించారు. నోయిడా సెక్టర్ 93బీలో నివసిస్తున్న ఓ మహిళతో బీజేపీ నేత త్యాగి అనుచితంగా ప్రవర్తించాడు.

ఈ ఘటనలో ఐపీసీ కింద కేసు నమోదు చేశారు. శ్రీకాంత్ త్యాగి ప్రస్తుతం పరారీలో ఉండగా.. అక్రమంగా సొసైటీ పార్క్ ను కబ్జా చేసిన త్యాగిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నోటీసులు ఇచ్చినా పట్టించుకోకుండా అక్రమ నిర్మాణాన్ని చేపట్టడంతో ఓ మహిళ ప్రశ్నించింది. ఆమెను నెట్టివేయడమే కాదు.. దూషించినట్టు ఉన్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

దీంతో అధికారులు ఎంట్రీ ఇచ్చి బీజేపీ నేత శ్రీకాంత్ త్యాగి ఇంటిని కూల్చేశారు. త్యాగి నలుగురు సన్నిహితులను అదుపులోకి తీసుకున్నారు. త్యాగి రెండు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అతడిపై ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశామని నోయిడా పోలీసులు ప్రకటించారు.త్యాగిపై కేసులు నమోదు చేసి అతడి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి.
Tags:    

Similar News