యూపీలో మోడీకి పంచ్ ప‌క్కానా?

Update: 2019-04-29 04:56 GMT
మ‌రోసారి అధికారం త‌మ‌దేన‌న్న ఆత్మ‌విశ్వాసంతో ఉన్న మోడీ ప‌రివారానికి కొత్త కంగారు పుట్టే స‌ర్వే ఒక‌టి తెర మీద‌కు వ‌చ్చింది. ఢిల్లీ పీఠాన్ని ద‌క్కించుకోవాలంటే.. యూపీలోని 80 నియోజ‌క‌వ‌ర్గాల్లో అత్య‌ధిక స్థానాల్ని సొంతం చేసుకోవాల్సిందే. 2014లో జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో 71 స్థానాల్ని కైవ‌శం చేసుకున్న మోడీ ప‌రివారానికి తాజా ఎన్నిక‌ల ఫ‌లితాల్లో షాక్ త‌ప్ప‌దంటున్నారు.

మోడీ వ్య‌తిరేక‌త ఒక ప‌క్క‌.. మ‌రోవైపు యూపీలో బీజేపీ కోల్పోయే సీట్లు బీజేపీకి కొత్త ఇబ్బందుల్ని తెచ్చి పెడ‌తాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. తాజాగా ప్ర‌ముఖ న్యూస్ వెబ్ సైట్ ది వైర్ ఒక స‌ర్వేను చేప‌ట్టింది. దీనికి ముందు మ‌రో స‌ర్వేను ఈ సంస్థ చేపట్టింది. ఈ రెండు స‌ర్వేల‌ను వేర్వేరుగా చేసిన‌ట్లుగా ఆ సంస్థ చెబుతోంది.

తొలి స‌ర్వేలో ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో బీజేపీకి కేవ‌లం 27 సీట్లు మాత్ర‌మే వ‌స్తాయ‌న్న మాట‌ను చెప్ప‌గా.. తాజాగా చేసిన స‌ర్వేలో మాత్రం కాస్త పుంజుకొని  30 స్థానాల్లో విజ‌యం సాధించే అవ‌కాశం ఉంద‌ని పేర్కొంది. అయితే.. గ‌త ఎన్నిక‌ల‌తో పోలిస్తే మాత్రం భారీగా దెబ్బ ప‌డ‌టం ఖాయ‌మ‌ని తేల్చింది. గ‌త ఎన్నిక‌ల్లో బంప‌ర్ మెజార్టీకి కార‌ణ‌మైన యూపీ.. ఈసారి మాత్రం దెబ్బేయ‌టం ఖాయ‌మ‌న్న‌ట్లుగా స‌ర్వే రిపోర్ట్ ఉంది. యూపీలో బీజేపీ దాదాపుగా 40 స్థానాల్ని కోల్పోనుంద‌ని చెప్ప‌టం ద్వారా.. ప‌లు ప్రాంతీయ పార్టీల‌కు కొత్త ఆశ‌లు చిగురించేలా చేస్తున్నాయ‌ని చెప్పాలి.

ఇంత‌కీ.. ఈసారి ఎన్నిక‌ల్లో బీజేపీని దెబ్బ తీసే అంశం ఏమిట‌న్న విష‌యానికి వ‌స్తే.. ఎస్పీ..బీఎస్పీ.. ఆర్ ఎల్డీలు జ‌ట్ట‌క‌ట్ట‌టంతో ఓట్లు ఒక ద‌గ్గ‌ర‌కు చేరాయ‌ని.. ఇది కాస్తా బీజేపీకి షాకింగ్ ఫ‌లితాలు రావ‌టానికి కార‌ణంగా మారుతుంద‌న్న అభిప్రాయాన్ని తాజా స‌ర్వే రిపోర్ట్ స్ప‌ష్టం చేసింది. మొద‌ట్నించి మోడీ బ్యాచ్ కు వ్య‌తిరేక వ్యాఖ్య‌లు చేసే వైర్ మాట‌ల్లో నిజం ఎంత‌న్న‌ది ఎన్నిక‌ల ఫ‌లితాలు తేలుస్తాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. 
Tags:    

Similar News