బీజేపీ గొప్ప పనులు...నేతల చిల్లర వేషాలు

Update: 2017-05-30 05:33 GMT
బీజేపీ పెద్దలు గొప్పగొప్ప పనులు చేయాలనుకుంటుంటే ఆ పార్టీ నేతలు మాత్రం చిల్లర వేషాలు వేస్తున్నారు. ముఖ్యంగా పార్టీ నిర్ణయాలకు ఫక్తు వ్యతిరేకంగా సాగుతున్నారు కొందరు. నిన్నటికి నిన్న మేఘాలయలో ఒక బీజేపీ నేత బీఫ్ ధరలు తగ్గిస్తామని ప్రకటించి కేంద్ర నిర్ణయానికి వ్యతిరేకంగా మాట్లాడిన సంగతి మరువక ముందే తాజాగా యూపీలో ఓ మహిళా మంత్రి  కూడా మద్యం విషయంలో అలాంటి పనే చేశారు.
    
ఉత్తరప్రదేశ్ మహిళా - శిశు సంక్షేమ శాఖ మంత్రి స్వాతి సింగ్‌ తాజాగా ఒక బార్ ప్రారంభించారు.  "బీ ద బీర్‌' అనే లగ్జరీ బార్‌ ను ఆమె లక్నోలో ప్రారంభించారు. దీనిపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతోంది.  బీజేపీ 'బీఫ్‌ ను బ్యాన్‌ చేసి, బీర్‌ ను పొంగిస్తోంది' అంటూ పలువురు ఎద్దేవా చేస్తుండగా, 'ముఖ్యమంత్రేమో మద్యం నిషేధిస్తానంటాడు, మంత్రులేమో మద్యం దుకాణాలకు క్యూకడుతున్నారు' అంటూ విపక్షాలు కూడా విమర్శలకు దిగుతున్నాయి.
    
మరికొందరైతే ఇంకా ఘాటు కామెంట్లు చేస్తున్నారు. బీజేపీ అసలు రూపం ఇదేనంటూ పోస్టింగులు పెడుతున్నారు.  అయితే... ఓ బీజేపీ అభిమాని మాత్రం చాలా ఆవేదన చెందిన 'ఏంటి స్వాతి మేడమ్‌ మీరు చేసిన పని' అంటూ చాలా బాధపడిపోయాడు. కాగా ఈ ఘటనపై మరి సీఎం యోగి ఎలా స్పందిస్తారు... మహిళా మంత్రి విషయంలో ఎలా వ్యవహరిస్తారన్నది చూడాల్సిందే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News