బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కమ్ క్వీన్ కంగనా నిర్వహిస్తున్న 'లాకప్ షో' ఎంతటి సంచలనంగా మారిందో తెలిసిందే. ఈ షోలో భాగంగా సెలబ్రిటీలు తమ రహస్యాలను బయట పెట్టటం.. అవన్నీ సంచలనంగా మారటమే కాదు.. ప్రధాన మీడియాలోనూ.. సోషల్ మీడియాలోనూ వార్తలుగా మారుతున్నాయి. అవి క్రియేట్ చేస్తున్న ప్రకంపనలపై అందరి చూపు పడుతోంది. తాజాగా ఈ షో నుంచి ఎలిమినేట్ అయిన నటి మందనా కరిమి హాట్ టాపిక్ గా మారారు.
దీనికి కారణం ఆమె తనకు సంబంధించిన ఒక రహస్యాన్ని బయటపెట్టటమే. భర్త నుంచి విడిపోయిన తర్వాత బాలీవుడ్ కు చెందిన ఒక ప్రముఖ దర్శకుడు పరిచయమైనట్లు పేర్కొన్నారు. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించిన అతడి కారణంగా తాను గర్భవతిని అయినట్లుగా చెప్పిన ఆమె..
తాను ప్రెగ్నెంట్ అయ్యాక ఆ దర్శకుడు ముఖం చాటేసినట్లుగా చెప్పిన వైనం షాకింగ్ గా మారింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఇంతలా మోసం చేసిన ఆ ప్రముఖ దర్శకుడు ఎవరన్న ఆరా ఎక్కువైంది.
ఇన్ని విషయాలు చెప్పిన మందనా కరిమి.. తనను మోసం చేసిన దర్శకుడి పేరును మాత్రం వెల్లడించలేదు. దీంతో.. ఎవరికి వారు సదరు దర్శకుడు ఎవరన్న ఆరా తీసి.. చివరగా ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్ ను తెర మీదకు తీసుకొచ్చారు. దీంతో ఆమె తీవ్ర వేదన చెందుతోంది. తాను చెప్పని విషయాన్ని చెప్పినట్లుగా ప్రచారం చేస్తున్నారంటూ వాపోతోంది. అనురాగ్ తనకు మంచి స్నేహితుడని.. అప్పుడే కాదు ఇప్పుడు కూడా మంచి స్నేహితుడేనని స్పష్టం చేసింది.
సోషల్ మీడియాలో సాగుతున్న ప్రచారంపై ఆమె విస్మయాన్ని వ్యక్తం చేసింది. ఇది అనైతికమని.. అనవసరంగా అతడి పేరును బద్నాం చేస్తున్నారని వాపోయింది. నమ్మించి మోసం చేసినోడు చేసిన దారుణమైన తప్పును చెప్పే ధైర్యం చేసిన మందనా అతడెవరో చెప్పేస్తే ఈ కన్ఫ్యూజన్ ఉండదు కదా?
అని ప్రశ్నిస్తున్నారు. అయితే.. తనను మోసం చేసిన దర్శకుడి పేరును చెప్పేందుకు మందనా సిద్ధంగా లేరని చెబుతున్నారు. అదే సమయంలో తనకు మంచి స్నేహితుడైన అనురాగ్ పేరును తప్పుగా ప్రచారం చేయటాన్ని ఆమె తీవ్రంగా తప్పు పడుతున్నారు.