విభజన చట్టంలో ఏముంది...అమరావతి మీద లోతైన విచారణ

Update: 2022-11-14 05:30 GMT
అమరావతి రాజధాని కేసు ఈ రోజు సుప్రీం కోర్టులో విచారణకు రానుంది. ఏకైక రాజధానిగా అమరావతి ఉండాలని ఉంటుందని హై కోర్టు తుది తీర్పు ఇచ్చింది. రాజధానిని మార్చే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి లేదంటూ పేర్కొంది. దీని మీద ఏపీ సర్కార్ సుప్రీం కోర్టుకు వెళ్ళింది. రాజధాని మీద నిర్ణయం తీసుకునే హక్కు ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి లేకపోవడమేమిటి అంటూ ఏపీ సర్కార్ సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది.

హై కోర్టు ఇచ్చిన తీర్పు మీద స్టే ఇవాలని కోరింది.  ఇదిలా ఉండగా అమరావతి రాజధాని కేసును అత్యున్నత న్యాయ స్థానం ఆషామాషీగా తీసుకోవడంలేదు. ఈ కేసులో లోతైన విచారణకే సుప్రీం కోర్టు సిద్ధం అవుతోంది. అసలు ఈ కేసు మూలాలు ఏంటి అన్నది కూడా పరిశీలించి 2014లో రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా పడిన పిటిషన్లను కొడా విచారణకు చేర్చడం విశేషం.

ఆనాడు ఉమ్మడి ఏపీని అడ్డగోలుగా విభజించారని పేర్కొంటూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సుప్రీం కోర్టులో పిటిషన్ ఫైల్ చేశారు. అదే విధంగా చాలా మంది ప్రజా ప్రయోజన వ్యాజ్యం కింద విభజనకు వ్యతిరేకంగా కేసులు వేశారు. ఇక అమరావతి రాజధానికి వ్యతిరేకంగా అనుకూలంగా కేసులు పడ్డాయి. ఇవన్నీ కలిపి ఏకంగా 35 దాకా లిస్ట్ అయి ఉన్నాయి.

అన్నింటికీ కలిపి విచారించాలని సుప్రీం కోర్టు ధర్మాసనం నిర్ణయించడం విశేషం. అంటే ఏకైక రాజధానిగా అమ్రావతినే ఉంచారా అలా విభజన చట్టం లో ఉందా అన్నది కూడా ఇపుడు పరిశీలనకు రానుంది అంటున్నారు. వీటికంటే ముందు విభజన పూర్తిగా అడ్డగోలుగా సాగింది అన్న దాని మీద కూడా పిటిషన్లు ఉన్నాయి. వాటిని కూడా ధర్మాసనం విచారించబోతోంది.

ఒక విధంగా చొసొతే ఈ కేసులో విచారణ సుదీర్ఘ కాలం పట్టే అవకాశం ఉంది అంటున్నారు. పూర్తి స్థాయిలో సమగ్రంగా విచారించి అమరావతి రాజధాని విషయంలో తుది తీర్పుని కోర్టు వెలువరిస్తుంది అని చెబుతున్నారు. ఇక విభజన అడ్డగోలుగా సాగింది అన్న దాని మీద కేంద్రానికి కూడా నోటీసులు సుప్రీం కోర్టు ఇస్తుందా అన్న చర్చ కూడా ఉంది. మరో వైపు విభజన చట్టంలో ఏముంది అన్నది కూడా ఇపుడు బహిర్గతం అయ్యే అవకాశం ఉంది.

విభజన చట్టాన్ని ఎవరి మటుకు వారు తమకు అనుకూలంగా అన్వయించుకుంటున్నారు. రాజధాని అంటే అది ఒక్కటా లేక ఎన్ని అయినా అన్నది కూడా చూడాల్సి ఉంది. అసలు రాజధాని విషయంలో రాజ్యాంగం ఏమి చెబుతోంది. అధికారాలు ఎవరికి ఉన్నాయి రాష్ట్రాలు కానీ కేంద్రం కానీ తమకు తోచినన్ని రాజధానులు ప్రకటించుకుంటూ పోవచ్చా ఇత్యాది విషయాలు అన్నీ కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంటుంది.

ఒక విధంగా అమరావతి రాజధాని కేసు దేశానికి భవిష్యత్తు తరాలకు దిశానిర్దేశం చేసే విధంగా ఉండబోతోంది అని అంటున్నారు. రాజ్యాంగంలో రాజధాని మీద ప్రత్యేకంగా ఏమీ నిర్వచింది లేదు అని చెబుతూ ఉంటారు. పాలకులు తమకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్న నగరాన్ని రాజధానిగా చేసుకుని పాలించవచ్చు అన్నది ఒక విధాంగంగా సంప్రదాయంగా ఇప్పటిదాకా ఉంటూ వచ్చింది.

అంతే కాదు ఒకచోట రాజధాని ఉంటే దాన్ని మార్చాలని కూడా గతంలో ఎపుడూ ప్రయత్నం జరగలేదు. అలాంటి పరిస్థితి ఉత్పన్నం అయితే దాన్ని ఏ విధంగా చూడాలి. రాజ్యాంగంలో దీని మీద నిర్వచించారా లేదా అన్న విషయాలు కూడా ఈ విచారణ సందర్భంగా బయటకు వచ్చే అవకాశం ఉంది.

ఇక ఏపీ సర్కార్ అయితే అమరావతికి తాము అన్యాయం చేయడంలేదని, అక్కడ శాసన రాజధాని ఉంటుందని, పైగా అమరావతిలో మౌలిక సదుపాయల కోసం ఇప్పటిదాకా పదిశాతమే ఖర్చు చేశారని, మిగిలినది పూర్తి చేయాలంటే లక్షల కోట్లు అవసరం అవుతాయని తమ వాదనలో వినిపించనుంది.

వికేంద్రీకరణ ప్రభుత్వ విధానమని, దాని వల్ల అమరావతి రైతులకు ప్రత్యేకంగా వచ్చే నష్టం ఏదీ లేదని, వారి ఒప్పందాలను ప్రభుత్వాను ఉల్లఘించే పరిస్థితి ఉండదని చెప్పనుంది. ఏది ఏమైనా అమరావతి రాజధాని వ్యవహారం అంటే సుదీర్ఘమైన ప్రక్రియగానే అంతా చూస్తున్నారు. ఈ కేసు పూర్తి అయి తీర్పు వచ్చేసరికి ఎంతకలాం పడుతుంది అన్నది చూడాలి. ఏది ఏమైనా ఉత్కంఠను రేకెత్తించే ఈ కేసు ఈ రోజు విచారణకు రాబోతోంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News