ఏపీలోని హాట్ టాపిక్ గా 63 అసెంబ్లీ నియోజకవర్గాలు

Update: 2022-11-10 10:30 GMT
ఏపీలో  రాజకీయం ఎంత హాట్ హాట్ గా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రశాంతంగా పట్టుమని పది రోజులుగా కూడా లేని పరిస్థితి జగన్ సర్కారు తీసుకొస్తుందా? అన్న ప్రశ్నఈ మధ్యన అంతకంతకూ ఎక్కువ అవుతుంది. అయితే.. సంచలన నిర్ణయాలు తీసుకోవటం.. వివాదాస్పద అంశాల్ని కెలకటం.. దానితో విషయాల్ని సైడ్ ట్రాక్ పట్టిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే.. తాజాగా బయటకు వచ్చిన ఈ వైనం షాకింగ్ గా మారింది.

సాధారణంగా జనాభాతో ఓటర్లను పోల్చే ప్రక్రియ ఒకటి ఉంది. ప్రతి వెయ్యి మందికి స్త్రీ.. పురుషుల నిష్పత్తి ఫలానా అంటూ ఒక లెక్క ఉంటుంది. అప్పుడప్పుడు ఇందులో చిన్నపాటి మార్పులు ఉంటాయి. తాజాగా మాత్రం అందుకు భిన్నంగా ఒక పరిణామం చోటు చేసుకుంది సాధారణంగా ప్రతి వెయ్యి మంది ప్రజలకు 724 మంది ఓటర్లు ఉంటారు. దీన్ని ఎలెక్టోర్ టూ పాపులేషన్ రేషియో అంటారన్న సంగతి తెలిసిందే. 2021 జనాభా లెక్కల ఆధారంగా ప్రస్తుత జనాభాకు తగ్గట్లుగా ఈ అంచనాను ఖరారు చేశారు. దాంతోనూ ఎలాంటి సమస్యా లేదు.

కానీ.. తాజాగా నియోజకవర్గాల వారీగా జనాభా వర్సెస్ ఓటర్లు లెక్క తీసినప్పుడు మాత్రం షాకింగ్ నిజాలు బయటకువస్తున్నాయి. ఏపీ వ్యాప్తంగా ఉన్న నియోజకవర్గాల్లో 20 నియోజకవర్గాలు మాత్రం ప్రతి వెయ్యి మంది ప్రజలకు 800 మంది ఓటర్లు ఉన్నట్లుగా గుర్తించారు. అదే సమయంలో రాష్ట్రంలోని మరో 43 నియోజకవర్గాల్లో మాత్రం ప్రతి వెయ్యి మంది జనాభాకు 750 మందికి పైనే ఓటర్లు ఉండటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

జిల్లాల వారీగా చూస్తే.. ఏడు జిల్లాల్లో ఈ గణాంకాల అసాధారణంగా ఉన్నట్లు గుర్తించారు. మొత్తం 63 స్థానాల్లో జనాభాకు సంబంధం లేనట్లుగా భారీగా ఓటర్లు ఉన్న విషయాన్ని గుర్తించారు. దీనిపై ఎన్నికల సంఘానికి ప్రతిపక్షాలు కంప్లైంట్ చేశాయి. ఈ ఉదంతంపై లోతైన విచారణ జరపాలన్న డిమాండ్ తెర మీదకు వచ్చింది.

జనాభా వర్సెస్ ఓటర్ల కు సంబంధించి అసాధారణంగా ఓటర్లు ఉన్న జిల్లాల్ని చూస్తే..

జిల్లా                 వెయ్యి జనాభాకు ఉణ్న ఓటర్లు
క్రిష్ణా                                  787
పశ్చిమగోదావరి                   778
బాపట్ల                               770
పల్నాడు                           769
పార్వతీపురం మన్యం          766
శ్రీకాకుళం                          759
విజయనగరం                     757

ఇక..ప్రతి వెయ్యి మందికి 800లకు పైనే ఓటర్లు ఉన్న నియోజకవర్గాల్ని చూస్తే.. నోట మాట రాక మానదు. మొత్తం నియోజకవర్గాల్లో 20 నియోజకవర్గాల్లో ప్రతు వెయ్యి మందిలో 800 మందికి.. అంతకంటే ఎక్కువ మందికి ఓటర్లు ఉన్నారు. అలాంటి నియోజకవర్గాల్లో టాప్ 10 నియోజకవర్గాలు.. అక్కడున్న ఓటర్ల లెక్క చూస్తే నోట మాట రాదు. ఇప్పుడు చెప్పే పది నియోజకవర్గాల్లో ప్రతి వెయ్యి మంది జనాభాకు గరిష్ఠంగా 851 మంది అయితే.. కనిష్ఠంగా 824 మంది ఉండటం గమనార్హం.

నియోజకవర్గం           ప్రతి వెయ్యి జనాభాకు ఉన్న ఓటర్ల సంఖ్య
వేమూరు                                 851
తెనాలి                                    848
పెడన                                     841
వెంకటగిరి                                836
అవనిగడ్డ                                 831
మచిలీపట్నం                           829
కావలి                                      828
ఆచంట                                   828
ఆదోని                                      824
దెందులూరు                            824

(వీటితో పాటు పొన్నూరు.. పామర్రులోనూ ప్రతి వెయ్యి మంది జనాభాకు 824 మంది ఓటర్లు ఉన్నట్లుగా గుర్తించారు)




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News