ఆడలేక మద్దెల ఓడు అన్నట్టు ఇప్పుడు ఉప ఎన్నికలు వచ్చినా, అసెంబ్లీ ఎన్నికలు వచ్చిన కన్నడ అగ్రహీరో, ఉత్తమ ప్రజాకీయ పార్టీ(యూపీపీ) అధ్యక్షుడు ఉపేంద్ర మాత్రం తాను చచ్చినా ఎన్నికల్లో పోటీచేయను అని తెగ భయపడిపోతున్నాడు. తాజాగా బెంగళూరులో విలేకరులతో మాట్లాడారు. కర్ణాటకలో జరుగుతున్న 15 అసెంబ్లీ ఉప ఎన్నికలకు తన పార్టీ తరుఫున అభ్యర్థులను ప్రకటించారు. మరి మీరెప్పుడు పోటీచేస్తారు అన్న ప్రశ్నకు ఉపేంద్ర ఇచ్చిన సమాధానం విని అందరూ షాక్ అయ్యారు.
తాను కొన్ని సినిమాలతో తీరికలేకుండా ఉన్నానని.. అందుకే ఎన్నికల్లో పోటీ చేయలేకపోతున్నానని ఉపేంద్ర చెప్పుకొచ్చాడు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయాల్సి ఉన్నా సినిమాల వల్ల వీలుకాలేదన్నారు. ఇప్పుడు కూడా సినిమా బిజీ షెడ్యూల్స్ కారణంగానే ఉప ఎన్నికలకు దూరంగా ఉన్నట్లు తెలిపాడు. ఇక ప్రస్తుత రాజకీయాలపై తాను ఏమీ మాట్లాడనని తెలిపారు.
నిజానికి తారలు రాజకీయ రంగ ప్రవేశం చేసి ఏలిన ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. ఎంజీఆర్, ఎన్టీఆర్, జయలలిత వంటివారు హిట్ అయ్యారు. కానీ నేటితరంలో చిరంజీవి, కమల్ హాసన్, పవన్ కళ్యాణ్ లాంటి వాళ్లు దారుణంగా విఫలమయ్యారు. జనాల దృక్కోణం మారింది. తారలను తెరపై ఆరాధిస్తున్న ప్రజలు రాజకీయంగా మాత్రం ఏమాత్రం పరిగణలోకి తీసుకోవడం లేదు. అందుకే కమల్, పవన్ లు గత సార్వత్రిక ఎన్నికల్లో చిత్తుగా ఓడారు.
ఈ విషయాన్ని గ్రహించే కాబోలు ఉపేంద్ర సర్దుకున్నట్టు కన్నడనాట గుసగుసలు వినిపిస్తున్నాయి. పార్టీ అయితే పెట్టాడు కాబట్టి ఉత్సాహవంతులైన అభ్యర్థులను ప్రకటించాడు. తనుపోటీకి మాత్రం చచ్చినా రానంటున్నాడు. సినిమాల పేరిట తప్పించుకుంటున్నాడు. అనవసరంగా డబ్బు, సమయం వృథా చేసుకోవద్దనే ఉపేంద్ర ఇలా దూరంగా జరుగుతున్నాడా అన్న ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.