చిన్నారి న‌ర‌బ‌లి....డీఎన్ ఏ రిపోర్ట్ మ్యాచ్!

Update: 2018-02-15 08:06 GMT
కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ లోని చిలుకానగర్ లో రాజశేఖర్‌ అనే ఓ క్యాబ్‌ డ్రైవర్‌ ఇంటి డాబాపై చిన్నారి తల ల‌భించిన ఘ‌ట‌న రాష్ట్రవ్యాప్తంగా క‌ల‌క‌లం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో కీల‌కంగా మారిన డీఎన్ ఏ నివేదిక నేడు పోలీసుల చేతికి రావ‌డంతో ఆ కేసు మిస్ట‌రీ దాదాపుగా వీడింది. డాబాపై ల‌భించిన శిశువు త‌ల‌లోని డీఎన్ ఏ - రాజ‌శేఖ‌ర్ ఇంట్లో లభించిన ర‌క్తం శాంపిల్స్ మ్యాచ్ అయ్యాయి. చనిపోయింది ఆడ శిశువువేనని ధృవీకరింని పోలీసులు.....ఫోరెన్సిక్ నివేదిక‌ను ఆధారం చేసుకొని ఇంటి యజమాని - క్యాబ్ డ్రైవ‌ర్ రాజశేఖర్ ఈ ఘోరానికి పాల్ప‌డ్డ‌ట్టు నిర్ధారణకు వచ్చారు. దీంతో - ఈ కేసులో రాజశేఖర్‌ - అతడి భార్య శ్రీలత సహా ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.

త‌న భార్య ఆరోగ్యంగా ఉండాల‌నే ఉద్దేశ్యంతో సంపూర్ణ చంద్ర‌గ్ర‌హణం నాడు రాజ‌శేఖ‌ర్ క్షుద్రపూజలు చేశాడ‌ని పోలీసుల ద‌ర్యాప్తులో వెల్ల‌డైన‌ట్లు తెలుస్తోంది. ఆమె కోలుకోవాలంటే ఓ చిన్నారిని నరబలి ఇవ్వాలని ఓ మాంత్రికుడు ఇచ్చిన సలహా ప్ర‌కారం సికింద్రాబాద్ బోయిగూడలో ఫుట్‌ పాత్ పై నిద్రిస్తున్న చిన్నారిని రాజశేఖర్ అప‌హ‌రించాడు. చంద్ర్రగ్రహణం రోజున త‌న ఇంట్లో భార్యతో కలిసి నగ్నంగా పూజలు చేసి శిశువును బలిచ్చారు. శిశువు తలపై చంద్రుని నీడ పడాలన్న‌ మంత్రగాళ్ల స‌ల‌హా ప్ర‌కారం శిశువు తలను మేడపై ఉంచాడు. ఇంట్లోని ర‌క్త‌పు మ‌ర‌క‌ల‌ను రసాయనాలతో తుడిచి వేసి చిన్నారి మొండాన్ని ప్రతాప సింగారం దగ్గర మూసీ నదిలో పడేసినట్లు దర్యాప్తులో వెల్లడైన‌ట్లు తెలుస్తోంది. ఈ కేసులో క్యాబ్‌ డ్రైవర్‌ రాజశేఖర్‌ - అతడి భార్య శ్రీలత - బంధువులు లచ్చక్క - బుచ‍్చమ్మ - నలుగురు మాంత్రికులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ కేసుకు సంబంధించిన‌ మరిన్ని వివరాలను ఈ రోజు సాయంత్రం 4 గంట‌ల‌కు నిర్వ‌హించ‌నున్న ప్రెస్ మీట్ లో పోలీసులు వెల్ల‌డించ‌నున్నారు.


Tags:    

Similar News