కరోనా మందు కోసం జాన్సన్‌ అండ్ జాన్సన్‌ తో అమెరికా భారీ డీల్‌..?

Update: 2020-03-31 14:30 GMT
కరోనా వైరస్ ..ఈ మహమ్మారి ప్రపంచ దేశాలని అతలాకుతలం చేస్తుంది. ఈ వైరస్ దెబ్బకి మెజారిటీ దేశాలు లాక్ డౌన్ లోకి వెళ్లాయి. ఈ వైరస్ భారిన పడి అగ్రరాజ్యం అమెరికా కూడా కొట్టుమిట్టాడుతోంది. ఇప్పటివరకు 164,359 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అలాగే 3,173 మంది కరోనా తో మృతి చెందారు. ప్రస్తుతం కరోనా తో ఎక్కువగా ఇబ్బంది పడుతున్న దేశం అమెరికానే. అయితే , ఈ కరోనా నుండి ఎలాగైనా బయటపడాలని భావిస్తున్న అమెరికా ..ఆ దిశగా చాలా వేగంగా అడుగులు వేస్తుంది.

ఇందులో భాగంగానే కరోనా వ్యాక్సిన్‌ కోసం 'జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌’ కంపెనీతో అమెరికా భారీ డీల్‌ కుదుర్చుకుంది. దీని విలువ రూ.3,438 కోట్లు. దీనికి సంబంధించిన ఒప్పందంపై అమెరికా ప్రభుత్వానికి చెందిన బయోమెడికల్‌ అండ్‌ అడ్వాన్స్‌డ్‌ రిసెర్చ్‌ అండ్‌ డెవల్‌పమెంట్‌ అథారిటీ , జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ సంతకాలు చేశాయి.

ఇందులో భాగంగా 2021 మార్చిలోగా 100 కోట్ల డోసుల కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ను జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ సమకూర్చనుంది. కరోనా వ్యాక్సిన్‌పై పరిశోధనలకు ఇప్పటికే ఆ కంపెనీ రూ.3,500 కోట్లను కేటాయించింది. తాజాగా అమెరికా ప్రభుత్వం నుంచి ఆర్థిక సహకారం కూడా లభించడం తో వ్యాక్సిన్‌ ప్రాజెక్టు మొత్తం విలువ రూ.7వేల కోట్ల కు చేరింది. ఈ క్రమంలో ఈ ఏడాది సెప్టెంబరుకల్లా మనుషులపై ప్రయోగ పరీక్షలను ప్రారంభించి, వచ్చే ఏడాదికల్లా కరోనా కి వ్యాక్సిన్‌ అందిస్తామని జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ ప్రకటించింది. ప్రస్తుతం తాము పరీక్షిస్తున్న ఒక లీడ్‌ క్యాండిడేట్‌ వ్యాక్సిన్‌ అత్యుత్తమ ఫలితాలను అందిస్తోందని ఆ సంస్థ తెలిపింది.
Tags:    

Similar News